Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir: అబ్బ‌బ్బా.. ఏం విజయం!

PAK vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్థాన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి అందర్నీ ఆశ్చర్య పరిచిన అఫ్గానిస్థాన్.. సోమవారం పాకిస్థాన్ జట్టును చిత్తు చేసి ఔరా అనిపించింది. అఫ్గానిస్థాన్ సాధించిన ఈ విజయాలకు క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు.

టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా అఫ్గానిస్థాన్‌ను ట్విటర్(ఎక్స్) వేదికగా కొనియాడాడు. అఫ్గాన్ ఇక నుంచి పసికూన జట్టు కాదని స్పష్టం చేశాడు. పెద్ద జట్లను ఓడించిన ఆ జట్టు బలమైన టీమ్ మారిందని కొనియాడాడు. 'ఇక నుంచి అఫ్గానిస్థాన్ అండర్ డాగ్స్ కాదు. ఇదే వారి అసలు సత్తా'అని అఫ్గాన్ ఆటగాళ్ల సంబరాలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు.

 Gautam Gambhir reaction after Afghanistan beat Pakistan by 8 wickets in World Cup 2023

గంభీర్‌తో పాటు ఇతర భారత మాజీ ఆటగాళ్లు సైతం అఫ్గానిస్థాన్ జట్టును కొనియాడారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ అయితే రషీద్ ఖాన్‌తో కలిసి చిందేసాడు. పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని రషీద్‌తో కలిసి ఆస్వాదించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ సాధించిన విజయాన్ని భారత అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ప్రపంచకప్ 2023లో అఫ్గాన్ సాధించిన రెండు విజయాల వెనుక భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఉండగా.. బీసీసీఐ ప్రోత్సాహంతోనే మేటి జట్లకు అఫ్గాన్ షాక్‌ ఇస్తోంది.

అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌కు బీసీసీఐ ఎంతో కాలంగా బాసటగా నిలుస్తోంది. మౌలిక సదుపాయాలను కల్పించడం నుంచి ఆ దేశంలో స్టేడియం నిర్మాణం వరకూ ఆర్థిక సహకారం అందించింది. ఇప్పుడు ఏకంగా ఆ జట్టు మన మాజీ స్టార్‌ ప్లేయర్‌ అజయ్‌ జడేజాను మెంటార్‌గా నియమించుకుంది. టోర్నీ ఆరంభానికి కేవలం వారం వ్యవధిలోనే జట్టుతో పాటు చేరిన అజయ్‌ జడేజా ఆటగాళ్లతో భలేగా కలిసిపోయాడు.

ఐపీఎల్లో అడిన అనుభవం, ఇక్కడి మైదానాల గురించి తెలిసిన వ్యక్తి మెంటార్‌ కావడంతో అఫ్గాన్ జట్టు దూసుకెళ్తోంది. రషీద్‌, ముజీబ్‌, నూర్, నబీ... ఇలా ఎవరికివారు తమదైన రోజున ప్రత్యర్థిని వణికిస్తున్నారు. ఈసారి బ్యాటింగ్ విభాగంపై అజయ్‌ జడేజా దృష్టి పెట్టాడని అర్థమవుతోంది. అందుకే అఫ్గాన్‌కు ఈ భారీ విజయాలు, షాక్‌లు ఇతర జట్లకు ఎదురవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

అఫ్గాన్ మెరుపు ఫీల్డింగ్.. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తడం వెనుక కూడా అజేయ్ జడేజా ఉన్నాడనే విషయం అర్థమవుతోంది. అజేయ్ జడేజా కూడా తాను ఆడే రోజుల్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసేవాడు. సింగిల్స్ వచ్చే చోట డబుల్స్ తీసేవాడు. అఫ్గాన్ విజయంతో జడేజా సాధించిన ఘనతలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Story first published: Tuesday, October 24, 2023, 16:35 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+