యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు అరుణ్ జైట్లీ పైరు: ప్రతిపాదించిన గంభీర్

హైదరాబాద్: ఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దివంగత నేత అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు లేఖ రాశారు. అనారోగ్యంతో అరుణ్ జైట్లీ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆగస్టు 9వ తేదీన జైట్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం మధ్యాహ్నాం 12.07 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. జైట్లీ మరణంతో బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది.
నాకు సోదరి లేదు.. ఉంటే స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేసేవాణ్ని!!
‘అరుణ్ జైట్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్'గా
ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ "మన అభిమాన నాయకుడి జ్ఞాపకార్థం యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని ‘అరుణ్ జైట్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్'గా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను" అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు ఓ లేఖ రాశారు. 1999లో ప్రారంభమైన ఈ కాంప్లెక్స్ 2010 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చింది.

బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా
ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. కొన్నేళ్లుగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది యువ క్రికెటర్లను ప్రొత్సహించారు. ఇక, ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో కీలకంగా వ్యవహారించారు.
ట్విట్టర్‌లో తన సంతాపాన్ని
అరుణ్ జైట్లీ మృతిపై గంభీర్ ట్విట్టర్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. ట్విట్టర్‌లో "తండ్రి నీకు మాట్లాడాలని చెప్తారు. తండ్రిలాంటి వారు నిన్ను ప్రసంగించాలని సూచిస్తారు. నాన్న నీకు నడక నేర్పిస్తారు. నాన్నలాంటి వ్యక్తి నీకు పరుగెత్తడం నేర్పిస్తారు. తండ్రి నీకు పేరు పెడతాడు. తండ్రి సమానులు నీకో గుర్తింపునిస్తారు. నా పితృ సమానుడైన అరుణ్ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది" అని గంభీర్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications