సరైన పీఆర్ ఎజెన్సీ లేకనే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన యువరాజ్ సింగ్ కంటే.. ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్స్‌కే ఎక్కువ గుర్తింపు లభించిందని అసహనం వ్యక్తం చేశాడు.
ధోనీ సొంత పీఆర్ ఎజెన్సీతో పాటు బ్రాడ్‌కాస్టర్ అతన్ని హైలైట్ చేసిందన్నాడు. బ్రాడ్ కాస్టర్స్.. వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యమిస్తూ సెలెక్టెడ్ ప్లేయర్లను హైలైట్ చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డాడు.

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 122 బంతుల్లో 97 పరుగులతో భారత విజయానికి బాటలు వేసాడు. ఈ మెగా టోర్నీలో యువరాజ్ సింగ్ 15 వికెట్లతో పాటు 362 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఫైనల్లోనూ గౌతమ్ గంభీర్ ఔటైన తర్వాత ధోనీకి అండగా హాఫ్ సెంచరీతో రాణించాడు.
అయితే ఈ ఇద్దరి ప్రదర్శన కంటే.. ఇన్నింగ్స్ చివర్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్సరే అందిరికి ఎక్కువగా గుర్తుంది. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ ఫైనల్ అనగానే రవి శాస్త్రి చెప్పిన 'ధోనీ ఫినెషెస్ ఇట్ ఆఫ్ ఇన్ స్టైల్, ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్'అనే ట్రేసర్ బుల్లెట్ కామెంటరీ అందరికి గుర్తొస్తుంది.
2011 ప్రపంచకప్ గెలుపు క్రెడిట్ ధోనీ ఒక్కడికే కట్టబెట్టడంపై గంభీర్ చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో ఇందుకు గల కారణాన్ని అడగ్గా.. యువీతో పాటు తనకు సరైన పీఆర్ ఏజెన్సీ లేకపోవడంతో రావాల్సిన గుర్తింపు రాలేదన్నాడు.
'2011 ప్రపంచకప్ విజయం క్రెడిట్ ఎవరిదనేది మీ అందరికి తెలుసు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నది ఎవరు? ఎంతమంది అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అతనికి సరైన పీఆర్ ఏజెన్సీ లేదు.
అడరేటేడ్ అంటూ మాట్లాడే జనాలే.. అసలైన ఆటగాళ్లకు విలువ ఇవ్వరు. వారి ప్రదర్శనను పట్టించుకోరు. ప్రశంసించరు. మళ్లీ వీళ్లే రావాల్సిన గుర్తింపు రాలేదంటారు.
బ్రాడ్‌కాస్టర్ ఎప్పుడూ ఓ ఆటగాడి పీఆర్ మిషనరీలా ఉండకూడదు. బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్, కొన్నీ టీవీ షోలు.. సెలెక్టెడ్ ప్లేయర్లను మాత్రమే హైలైట్ చేస్తున్నాయి. బ్రాడ్‌కాస్టర్స్ కాస్త ఫెయిర్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. జట్టులోని ఆటగాళ్లందర్నీ గుర్తించాలి. అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రతీ ఆటగాడి గురించి మాట్లాడాలి.'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.