Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరిని పక్కన పెట్టి రిషభ్ పంత్, షమీలను ఆడించండి: గౌతమ్ గంభీర్

 Gautam Gambhir Picks Rishabh Pant Over Dinesh Karthik In India Playing XI In T20 World Cup 2022

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో రిషభ్ పంత్‌తో పాటు మహమ్మద్ షమీలను తీసుకోవాలని సూచించాడు. ఇక మెగా టోర్నీ అసలు సమరం శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

సూపర్ 12లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తొలి మ్యాచ్ ఆడనుండగా.. భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్ గురించి మాట్లాడిన గౌతమ్ గంభీర్..ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించే భారత ఆటగాళ్లెవరో అంచనా వేశాడు.

కార్తీక్ వద్దు..

కార్తీక్ వద్దు..

తానైతే భువనేశ్వర్‌ కుమార్‌కు బదులుగా మహమ్మద్ షమీని ఎంచుకుంటానని.. అలాగే దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌ను తీసుకుంటానని చెప్పాడు. అందుకు గల కారణాలను కూడా వివరించాడు. 'జట్టులో ముగ్గురు పేసర్లు ఉండాలి. నా అంచనా ప్రకారం.. భువనేశ్వర్‌ స్థానంలో మహమ్మద్‌ షమీని ఆడించాలి.

అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌కు మిగిలిన రెండు స్థానాలు ఇవ్వాలి. కేవలం పది బంతులు ఆడటానికే ఆటగాళ్లను ఎంచుకోకూడదు. కార్తీక్‌కు సుదీర్ఘంగా ఆడే అవకాశం ఇవ్వలేదో లేక అతడు అలాంటి ప్రదర్శన చేయలేదో తెలియదు గానీ అతడు కేవలం డెత్‌ ఓవర్లలో మూడు నాలుగు బంతులు మాత్రమే ఆడటానికి వచ్చేవాడు.

పంత్‌ జట్టును ఆదుకుంటాడు..

పంత్‌ జట్టును ఆదుకుంటాడు..

ఒకవేళ భారత్‌ వెంటవెంటనే రెండు వికెట్లు నష్టపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఆ స్థానంలో పంత్‌ సరైన ఎంపిక. హార్దిక్‌ను తొలి ఓవర్లలో పంపకపోవడమే మంచిది. యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌ ఇద్దరూ స్పిన్నర్లుగా ఉంటారు. ఓపెనర్‌గా అయినా డెత్‌ ఓవర్లలో అయినా బౌలర్‌గా షమీ రాణిస్తాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో అతడు గొప్పగా ఆడాడు'అని గంభీర్‌ గుర్తు చేశాడు.

కార్తీక్‌కే రోహిత్ మొగ్గు..

కార్తీక్‌కే రోహిత్ మొగ్గు..

పంత్‌ను తీసుకోవాలని గంభీర్ సూచిస్తున్నా.. టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం దినేశ్ కార్తీక్‌వైపే మొగ్గు చూపనుంది. ఎందుకంటే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల్లోనూ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంతేకాకుండా పంత్ జట్టులోకి వస్తే టీమ్ కాంబినేషన్ క్లిష్టంగా మారుతోంది. పంత్‌ను తీసుకుంటే ఓ ఆల్‌రౌండర్‌ను పక్కనపెట్టాల్సి వస్తుంది.పైగా ఓ మంచి ఫినిషర్‌ను దూరం చేసుకోవాల్సి వస్తుంది. గంభీర్ మినహా ఎవరూ పంత్‌ను తీసుకోవాలని చెప్పడం లేదు.

పాక్ మ్యాచ్ డౌటే..

పాక్ మ్యాచ్ డౌటే..

యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లానినా ప్రభావం కారణంగా ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత్ X పాక్ మ్యాచ్‌కు వేదికైన మెల్‌బోర్న్‌లో కూడా వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం కూడా 80 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వర్షం కాస్త బ్రేక్ ఇవ్వడంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. అయితే వాతావరణ మెరుగవుతుందనే సంకేతాలు వినబడుతున్నాయి.

Story first published: Saturday, October 22, 2022, 8:47 [IST]
Other articles published on Oct 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+