
పృథ్వీ షా ఔట్.. గిల్ ఇన్
ఫస్ట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమైన పృథ్వీషాను పక్కనపెట్టిన గంభీర్.. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించాడు. మయాంక్ అగర్వాల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించాలన్నాడు. ‘వాస్తవానికి అనుభం దృష్ట్యా పృథ్వీషానే ఈ సిరీస్‌ను ప్రారంభించాలనుకున్నా. ఫామ్ లేకపోయినా గత సిరీస్‌లో రాణించాడనే కారణంతో అతనికే అవకాశం ఇవ్వాలనుకున్నా. కానీ ప్రస్తుత ఫామ్, అంతకంటే అతనిలో ఆత్మవిశ్వాసం లోపించింది. కాబట్టి శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వడం ఉత్తమం అనుకుంటున్నా. మయాంక్ ఇన్నింగ్స్ ఆరంభించాలి. చతేశ్వర్ పుజారా యాధావిధిగా మూడులో బరిలోకి దిగాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రహానే ముందుండి నడిపించాలి..
విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అజింక్యా రహానే జట్టును నడిపించనున్నాడు. అయితే విరాట్ వచ్చే నాలుగో స్థానంలోనే రహానే బ్యాటింగ్‌కు రావాలని, కోహ్లీ స్థానంలో రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘రహానే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. అతను ఇప్పుడు కెప్టెన్ కాబట్టి జట్టును ముందుండి నడిపించాలి. అందుకే ఐదులో కాకుండా నాలుగులో ఆడాలంటున్నా. కోహ్లీ స్థానంలో రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలి. అతన్ని ఐదో స్థానంలో, సాహా ప్లేస్‌లో రిషభ్ పంత్‌ను తీసుకొని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. 'అని గంభీర్ సూచించాడు.

జడేజాను తీసుకోవాలి..
ఇక తదుపరి మ్యాచ్‌కు భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. జడేజాను తుది జట్టులోకి తీసుకుంటే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు కలిసిసొస్తుందన్నాడు. హనుమ విహారి స్థానంలో జడేజాను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. ‘జడేజా, అశ్విన్ ఏడు, 8వ స్థానంలో బరిలోకి దిగాలి. వారికి తోడుగా ముగ్గురు పేసర్లు ఎలాగు ఉంటారు. అప్పుడు ఐదుగురు బౌలర్లతో బౌలింగ్ విభాగం పటిష్టం అవుతోంది.'అని గంభీర్ పేర్కొన్నాడు. గాయపడ్డ మహ్మద్ షమీ స్థానంలో నవ్‌దీప్ సైనీ/ మహ్మద్ సిరాజ్‌లలో ఒకరిని తీసుకోవాలన్నారు.
గంభీర్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, నవ్‌దీప్ సైన/మహ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications
