Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అతనే అడ్డంకి!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులను తిరగరాస్తూ.. వరల్డ్ క్లాస్ బౌలర్లను వణికించిన ఈ బీహార్ యువ సంచలనం.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్దంగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి నిరాశే ఎదురయ్యింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Why Gautam Gambhir Refuses to Push the 15-Year-Old Prodigy Vaibhav Sooryavanshi s Debut

గంభీర్ విధానంతోనే..

అయితే అతని అరంగేట్రం ఆలస్యమవ్వడానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న విధానమే ప్రధాన కారణం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026, ఆసియా కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో దూసుకుపోతున్న గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్.. జట్టులో తాము సృష్టించిన వాతావరణాన్ని దెబ్బతీయకూడదని భావిస్తోంది.

IND vs ENG: శ్రేయస్, అభిషేక్ పోరాటం వృథా.. తొలి టీ20 మ్యాచ్ రద్దు

IND vs ENG: శ్రేయస్, అభిషేక్ పోరాటం వృథా.. తొలి టీ20 మ్యాచ్ రద్దు

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి సీనియర్లు ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారని, ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన వారిని కాదని 15 ఏళ్ల కుర్రాడిని నేరుగా జట్టులోకి తీసుకురావడం సరైన సంకేతం కాదని మేనేజ్‌మెంట్ నమ్ముతోంది.

అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే మాట్లాడుతూ.. 'వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వంద శాతం సిద్ధంగా ఉన్నాడు. కానీ అతని కోసం మూడు నెలల క్రితమే మనకు ప్రపంచకప్ అందించిన సంజూ శాంసన్‌ను పక్కన పెట్టలేం' అని స్పష్టం చేశారు. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్లకు భద్రత, నమ్మకం కల్పించడం ముఖ్యమని పేర్కొన్నాడు.

మాజీ క్రికెటర్లు ఆగ్రహం..

వైభవ్‌ను వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ల్లోనే వైభవ్‌ను పరీక్షించాల్సిందని అభిప్రాయపడ్డారు. రవిశాస్త్రి అయితే కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

'వైభవ్‌ను ఐర్లాండ్‌తో మ్యాచ్‌ల్లో ఆడించాల్సింది. అక్కడ ఆడి ఉంటే ఐర్లాండ్ బౌలర్ల 'ప్యాంట్లు ఊడదీసేలా' మైదానం బయటకు సిక్సర్లు బాదేవాడు. ఇంగ్లాండ్‌లో అతనికి అవకాశం ఇస్తారో లేదో తెలీదు కానీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైభవ్‌కు అవకాశం ఇవ్వాలి.'అని సోనీ స్పోర్ట్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్‌మెంట్ పట్టుదల, మాజీ క్రికెటర్ల ఒత్తిడి మధ్య వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఎప్పుడానేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Story first published: Thursday, July 2, 2026, 17:44 [IST]
Other articles published on Jul 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+