థ్యాంక్స్ చెప్పిన సంతోష్..
ఇక గంభీర్ మొక్కలు నాటిన వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఈ చాలెంజ్‌లో భాగమైనందుకు ధన్యవాదాలు తెలిపారు. 'తన చేతులతో మొక్కను నాటి మన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగమైన గౌతమ్ గంభీర్ గారికి ధన్యవాదాలు. మీ మహోన్నతమైన వ్యక్తులు భాగమైతే ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగుతుంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది.
మీ స్పూర్తిదాయక మాటలకు కృతజ్ఞతలు'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన గంభీర్.. బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్నప్పటికీ క్రికెట్ సంబంధించిన వ్యవహారాల్లో చురుకుగా ఉంటున్నారు.

ధోనీ చేసేదేం ఉండదు..
ఇటీవల టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై గంభీర్ స్పందించాడు. టీమ్ మెంటార్‌గా మహేంద్ర సింగ్ ధోనీని నియమించడంపై విభిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. మెంటార్‌గా ధోనీ చేసేదేం ఉండదన్నాడు. 'బహుశా.. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ధోనీ.. మెంటార్‌గా వ్యవహరిస్తే జట్టుకు మంచి జరుగుతుందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించి ఉండొచ్చు.
అయితే ధోనీ ఎంపిక నైపుణ్యం పరంగా జరిగింది కాదు. ఎందుకంటే భారత జట్టులోని క్రికెటర్లందరూ నైపుణ్యం కలిగినవారే. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ధోనీ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసు కాబట్టి.. ఆటగాళ్లకు అది ప్రయోజనంగా మారొచ్చు.

యువ ఆటగాళ్ల కోసమే..
ముఖ్యంగా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లున్నారు. రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తీ, సూర్యకుమార్ యాదవ్‌లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. వారితో ధోనీ తన అనుభవాన్ని కచ్చితంగా పంచుకుంటాడు. ఈ ఒక్క విషయంలో తప్పా ధోనీ వల్ల జట్టుకు ఒరిగేదేమి లేదు. స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, ఇతర సహాయ సిబ్బింది ఉండనే ఉన్నారు. " అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

సూర్య బెస్ట్..
టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన గంభీర్.. టీ20 ఫార్మాట్‌లో రాణించేందుకు అవసరమైన అన్ని మెళకువలు అతనిలో ఉన్నాయన్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో పోల్చి చూస్తే సూర్యకుమార్ ఎంతో ప్రతిభావంతుడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'సూర్యకుమార్ యాదవ్ పూర్తి భిన్నమైన ఆటగాడు.
శ్రేయస్ అయ్యర్‌తో పోలిస్తే అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అసాధారణమైన ఆటగాడు. టీ20 ఫార్మాట్‌లో మనకు ఇలాంటివారే కావాలి. బంతిని మైదానంలో నలువైపులా బాదే ఆటగాళ్లు మనకు కావాలి. టీ20 క్రికెట్ అంటేనే అది. సూర్యకుమార్.. లాప్ (కీపర్ వెనుక మీదుగా బాదడం), లేట్ కట్, ఎక్స్ ట్రా కవర్ షాట్‌లతోపాటు అన్ని రకాల షాట్లను ఆడగలడు. ముఖ్యంగా నాలుగో స్థానంలో.
ఎందుకంటే కొన్నిసార్లు టీ 20 క్రికెట్‌లో బ్యాటింగ్ చేయడానికి నాలుగో స్థానం అత్యంత కఠినమైనది. బహుశా మొదటి మూడు స్థానాలు చాలా సులభమైనవి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు జట్టు అంతకుముందే రెండు వికెట్లు కోల్పోయి ఉండొచ్చు. అప్పుడు పరుగులు రాబట్టడం కోసం వేగంగా ఆడతారు' అని గంభీర్ అన్నాడు.


Click it and Unblock the Notifications












