
ధోనీ అంటే గౌరవం..
'నాకు ధోనీ అంటే గిట్టదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. ధోనీ అంటే నాకు అమితమైన గౌరవం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను. మళ్లీ చెబుతున్నా. ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పగలను. అతడికి ఏ అవసరం వచ్చినా ముందుంటాను. ధోనీకి అలాంటి పరిస్థితి రాదు. కానీ, వస్తే అండగా ఉంటా. అతను టీమిండియాకు చేసిన సేవలే అందుకు కారణం. మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే.. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఇంకో విషయం.. ధోనీ సారథ్యంలో నేనే ఎక్కువకాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్నా. ఐపీఎల్‌లో ఆడినప్పుడు మాత్రమే మైదానంలో ప్రత్యర్థుల్లా ఉన్నాం'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

మూడో స్థానంలో ఆడి ఉంటే..
అలాగే ధోనీ టీమిండియా తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి ఉంటే అన్ని రికార్డులు బద్దలయ్యేవని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు నంబర్-3లో గొప్ప ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నా.. మహీ ఆ స్థానంలో ఆడితే ప్రతి రికార్డునూ తిరగరాసేవడని చెప్పాడు. కాగా, ధోనీ కెరీర్ ఆరంభంలో టీమిండియా తరఫున పలు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో ఆడాడు. అక్కడ అతను 16 ఇన్నింగ్స్‌లు ఆడి 993 పరుగులు చేశాడు. ఇక 2005లో పాకిస్థాన్‌పై 148, శ్రీలంకపై 183 పరుగులు కూడా ఆ స్థానంలో ఆడినప్పుడు సాధించినవే కావడం విశేషం. ఈ విషయాన్నే గంభీర్ ప్రస్తావించాడు.

ధోనీపై చాలా విమర్శలు..
అవకాశం దొరికినప్పుడల్లా గంభీర్.. ధోనీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రపంచకప్ విజయాలతో ధోనీకి దక్కిన క్రెడిట్‌ను అతను ఏ మాత్రం సహించలేకపోయాడు. అతని ఒక్కడి వల్లనే భారత్ ప్రపంచకప్ గెలవలేదని, టీమ్ మొత్తం రాణిస్తేనే చిరస్మరణీయ విజయం దక్కిందని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. '2011 వన్డే వరల్డ్‌కప్ భారత్ అంతా కలిసి సాధించింది. ముఖ్యంగా భారత జట్టు, సహాయక సిబ్బంది వల్లనే ఇది సాధ్యమైంది. ధోనీ సిక్సర్ ఒక్కటే విజయాన్నందించలేదు. సమష్టి ఆటతీరువల్లే ఈ విజయం దక్కింది'అని క్రిక్ ఇన్‌ఫో చేసిన ఓ ట్వీట్‌కు గంభీర్ గతంలో బదులిచ్చాడు.

తనకు క్రెడిట్ రాలేదని..
శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆదిలోనే సచిన్, సెహ్వాగ్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి గట్టెక్కించాడు. కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇలా తాను ఔటవ్వడానికి కూడా ధోనీనే కారణమని పలు ఇంటర్వ్యూల్లో గంభీర్ తెలిపాడు. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఔట్ కావాల్సి వచ్చిందన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే పరిస్థితి. ఆ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేసినా మొండిగా పోరాడి భారత్‌కు పోరాడే స్కోరు అందించింది మాత్రం గంభీర్ అనే విషయం చాలామందికి తెలియదు. 54 బంతుల్లోనే 75 పరుగులు చేసి జట్టు స్కోరును 155కు చేర్చాడు. కానీ ఈ రెండు ప్రపంచకప్ విజయాల్లో గంభీర్ పేరు మాత్రం వినిపించదు.


Click it and Unblock the Notifications

