For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gautam Gambhir: శ్రేయస్ అయ్యర్.. అహంకారం తగ్గించుకో!

IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌‌కు మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక సలహా ఇచ్చాడు. బ్యాటింగ్‌లో షార్ట్ బాల్ సమస్యను అధిగమించాలంటే ఈగోను పక్కనపెట్టాలని సూచించాడు. మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రేయస్ అయ్యర్(4) షార్ట్ బాల్‌కే వెనుదిరిగాడు.

ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో నాలుగు సార్లు శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బాల్‌కే వెనుదిరిగాడు. ఈ బాల్స్ ఆడటం అయ్యర్‌కు పెద్ద బలహీనతగా మారిపోయింది. అతను క్రీజులోకి రాగానే ప్రత్యర్థి బౌలర్లు షార్ట్ పిచ్ బాల్స్ వేస్తున్నారు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో శ్రేయస్ అయ్యర్ బలహీనతపై ప్రత్యేకంగా మాట్లాడిన గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Gautam Gambhir offers Key advice to Shreyas Iyer to overcome short-ball woes in World Cup 2023

ప్రతీ బౌన్సర్‌ను ఆడాలనే శ్రేయస్ అయ్యర్ ఆలోచనే అతని సమస్యకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. 'నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినంత మాత్రానా శ్రేయస్ అయ్యర్ సమస్యకు పరిష్కారం లభించదు. ఈ బలహీనతను అధిగమించడంపైనే అతను ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ప్రతీ మ్యాచ్‌లో షార్ట్ బాల్స్ కోసమే ఎదురు చూస్తున్నాడు.

ముందుకు వెళ్లి మరీ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. మన ఆధీనంలో ఉన్న ఎత్తులో బంతి వచ్చినప్పుడే పుల్ షాట్ ఆడాలి. కానీ అయ్యర్ మాత్రం ప్రతీ బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఈ రోజు కూడా అయ్యర్.. క్వాలిటీ బౌలర్లపై పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.

మన కంట్రోల్‌లో ఉన్న బంతులను మాత్రమే పుల్ షాట్ ఆడాలనేది క్రికెట్‌లో ప్రాథమిక సూత్రం. షార్ట్ బాల్స్ విషయంలో అతను ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ప్రతీ ఒక్కరు షార్ట్ బాలే వేస్తున్నారని అనుకుంటున్నాడు. వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనే ఆలోచనతో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.

బ్యాటింగ్‌లో అహంకారం ఏ మాత్రం పనికిరాదు. నెట్స్‌లో ఈ సమస్యను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించినా.. ఈగోతో బ్యాటింగ్ చేయకూడదు. షార్ట్ బాల్ సమస్యను అధిగమించేందుకు శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కానీ అతను మరింత స్మార్ట్‌గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. పుల్ షాట్ ఆడేందుకు బంతి ఎంత ఎత్తులో ఉండాలనే విషయాన్ని అతను ముందు తెలుసుకోవాలి.'అని గంభీర్ సూచించాడు.

6 మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్ 134 పరుగులే చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. శ్రేయస్ అయ్యర్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

Story first published: Monday, October 30, 2023, 17:38 [IST]
Other articles published on Oct 30, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+