Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్‌సీబీ‌లోకి మ్యాక్స్‌వెల్.. పంజాబ్ కింగ్స్‌కు ఉమేశ్ యాదవ్: గౌతం గంభీర్

Gautam Gambhir Names Three Players KXIP Should Target in IPL 2021 auction

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021‌కు సంబంధించిన మినీ వేలం గురువారం చెన్నై వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో వేలం భారీ ధర పలికే ఆటగాళ్లపై ఉహాగానాలు, అంచనాలు మొదలయ్యాయి. కోట్లు కోల్లగొట్టే ఆటగాళ్లు వీరేనంటూ.. మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా స్టార్ స్పోర్ట్స్ షోలో ఐపీఎల్ వేలానికి సంబంధించిన తన అంచనాలను పంచుకున్నాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకునే అవకాశం ఉందన్నాడు.

మ్యాక్సీ మళ్లీ..

మ్యాక్సీ మళ్లీ..

'బ్యాటింగ్​లో విరాట్​ కోహ్లీ, ఏబీ డివీలియర్స్​లపై ఒత్తిడిని తగ్గించేందుకు మాక్స్​వెల్ వంటి ఆటగాడిని ఆర్సీబీ తీసుకునే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్​ కోహ్లీ.. ఓపెనింగ్​కు సరిగ్గా సరిపోతాడు. అతడు దేవద​త్​ పడిక్కల్​తో ఓపెనింగ్​కు దిగితే.. తదుపరి ఆర్డర్లో డివీలియర్స్​ వస్తాడు. మాక్స్​వెల్​ లాంటి మరొక అదనపు బ్యాట్స్​మన్​ కోసం ఆర్‌సీబీ వెతుకుతుంది. నవదీప్​ సైనీ, మహమ్మద్​ సిరాజ్​ వంటి యువ పేసర్లు బెంగళూరుకు ఉన్నారు. కానీ ఉమేశ్​ యాదవ్​ లాంటి ప్రధాన పేసర్​ను ఆ జట్టు వదులుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా, గురువారం జరిగే వేలంలో మాక్స్​వెల్​ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడు" అని గంభీర్​ పేర్కొన్నాడు.

 పంజాబ్‌కు ఉమేశ్ యాదవ్..

పంజాబ్‌కు ఉమేశ్ యాదవ్..

పంజాబ్​ కింగ్స్​ జట్టు తమ బౌలింగ్​ విభాగాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించే అవకాశముందని గంభీర్​ పేర్కొన్నాడు. 'పంజాబ్​ జట్టులో మహమ్మద్​ షమీకి తోడు సరైన బౌలర్​ లేడు. ఉమేశ్​ యాదవ్​.. షమీతో బంతి పంచుకుంటే అద్భుతంగా ఉంటుంది. అందుకే పంజాబ్ ఉమేశ్​ను​ తీసుకునే అవకాశముంది. డెత్​ ఓవర్లలో​ సమర్థంగా బౌలింగ్ చేయగల క్రిస్​ మోరిస్, కైల్​ జేమిసన్​ వంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకునే అవకాశం లేకపోలేదు' అని గంభీర్​ అభిప్రాయపడ్డాడు.

మంచి మార్కెటింగ్ స్టంట్..

మంచి మార్కెటింగ్ స్టంట్..

'కోహ్లీ సారథ్యంలో ఆడటం ఎంతో ఇష్టమని మ్యాక్స్‌వెల్ చెప్పడం మంచి మార్కెటింగ్ స్టంట్. అతను ఎక్కువగా పరుగులు చేయగల ఏకైక మైదానం చిన్నస్వామి స్టేడియమని భావిస్తున్నాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పైనే ఒత్తిడి ఉంటుందని అతనికి తెలుసు. ఒకవేళ మ్యాక్స్‌వెల్ బెంగళూరు జట్టులోకి వచ్చినా కూడా అంచనాలన్నీ కోహ్లీ, డివిలియర్స్‌లపైనే ఉంటాయి. ఇది అనవసర ఒత్తిడి తగ్గిస్తుందని మ్యాక్సీ అభిప్రాయం. ఇక చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ చేయడానికి మంచి అనువైన వేదిక. చిన్నస్వామి‌లో చేసిన పరుగులను చెన్నై చెపాక్‌లో సాధించినవాటితో పోల్చలేం. అందుకే నేను విరాట్ కోహ్లీ కన్నా సురేశ్ రైనాకే ఎక్కువ రేటింగ్ ఇస్తుంటాను.

 ఆర్‌సీబీలోకి మ్యాక్సీ..

ఆర్‌సీబీలోకి మ్యాక్సీ..

ఈ వేలంలో కూడా గ్లేన్ మ్యాక్స్ వెల్ కీలకం కానున్నాడు. అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అతనిలాంటి ఆటగాళ్లు వేలంలో ఎక్కువగా లేకపోవడం కలిసొచ్చే అంశం. మ్యాచ్‌లు గెలిపించే సత్తా అతనిలో ఉంది. కానీ అతని నుంచి ఏం ఆశిస్తున్నారో అనే విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ క్లారిటీకి రావాల్సిన అవసరమైతే ఉంది. ఆ తర్వాత మ్యాక్సీని తీసుకునే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలి. ఇక మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ తీసుకునే అవకాశం ఉంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, February 17, 2021, 19:32 [IST]
Other articles published on Feb 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+