టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్‌లో మోస్ట్ స్ట్రైలిష్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటన అనంతరం టీమిండియా నెల రోజుల పాటు విశ్రాంతి దొరికింది. ఆసియా కప్ 2025తోనే టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. విశ్రాంతి సమయాన్ని ఆటగాళ్లతో పాటు కోచ్‌లు ఆస్వాదిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోని ఓ మ్యాచ్‌కు గౌతమ్ గంభీర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను రాపిడ్ ఫైర్ క్వశ్చన్ రౌండ్‌లో పాల్గొన్నాడు. శుభ్‌మన్ గిల్‌ను మోస్ట్ స్టైలిష్ బ్యాటర్‌గా పేర్కొన్నాడు. క్లచ్‌గా సచిన్ టెండూల్కర్, స్పీడ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా, దేశీబాయ్‌గా విరాట్ కోహ్లీ, గోల్డెన్ ఆర్మ్‌గా నితీశ్ రాణా, మిస్టర్ కన్‌స్టిస్టెంట్‌గా రాహుల్ ద్రవిడ్, రన్ మెషీన్‌గా లక్ష్మణ్, మోస్ట్ ఫన్నీ ప్లేయర్‌గా రిషభ్ పంత్ పేర్లను సూచించాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా జహీర్ ఖాన్ పేరు పేర్కొన్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా బుమ్రాను ఎంచుకోవాలని ఉన్నా.. అతనికి స్పీడ్ ట్యాగ్ ఇచ్చానని తెలిపాడు. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు గంభీర్ ఎలాంటి ట్యాగ్ ఇవ్వకపోవడం గమనార్హం.

గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంది. టెస్ట్‌ల్లో ఘోర పరాజయాలు చవిచూసిన టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆసియా కప్ 2025లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఆసియా కప్‌లో విజేతగా నిలిస్తే ఎలాంటి మార్పులు లేకుండా ఆ జట్టునే టీ20 ప్రపంచకప్ 2026కు సిద్దం చేయనున్నారు.
గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టు నుంచి నిష్క్రమిస్తున్నారు. ముందుగా రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోగా.. రోహిత్, కోహ్లీ వారం వ్యవధిలోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.