న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gautam Gambhir: ఏబీ డివిలియర్స్‌కు నో చాన్స్.. ఆర్‌సీబీ ఆ ముగ్గురినే రిటైన్ చేసుకుంటుంది!

Gautam Gambhir names 3 players RCB could retain ahead of IPL 2022, No place for AB de Villiers
IPL 2022 : Gautam Gambhir Names 3 Players RCB Can Retain Ahead Of IPL 2022 || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఏబీ డివిలియర్స్‌ను రిటైన్ చేసుకోదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్‌ని రిటైన్‌ చేసుకోకపోవచ్చన్నాడు.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగులు (513) చేసిన మ్యాక్సీకి ఆర్‌సీబీ మంచి భవిష్యత్తు ఉందని, 37 ఏళ్ల డివిలియర్స్‌కు ఈ అవకాశం లేదని గంభీర్‌ పేర్కొన్నాడు. మ్యాక్స్‌వెల్‌తో పాటు కోహ్లీ, హర్షల్ పటేల్ లేదా చాహల్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే అవకాశం ఉందని గంభీర్ అంచనా వేసాడు.

ఆ ముగ్గురికే చాన్స్..

ఆ ముగ్గురికే చాన్స్..

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫో షోలో పాల్గొన్న గంభీర్‌ను.. వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీ.. మ్యాక్స్‌వెల్, యుజ్వేంద్ర చాహల్, విరాట్ కోహ్లీలను రిటైన్ చేసుకుంటుందా? అని ప్రశ్నించగా.. అవునని గంభీర్ సమాధానమిచ్చాడు. అయితే జాబితాలో తాను హర్షల్ పటేల్‌ను కూడా కలుపుతున్నాని చెప్పాడు. చాహల్, హర్షల్‌లో ఆర్‌సీబీ తమకు అవసరమైన వారిని తీసుకోవచ్చన్నాడు. 'అవును. కాకపోతే ఈ ముగ్గురికి నేను హర్షల్ పటేల్‌ను కలుపుతున్నా. చాహల్, హర్షల్ పటేల్‌లో ఒకరి తీసుకునే అవకాశం ఉంది. ఇది వారి ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఏబీడీకి నో చాన్స్..

ఏబీడీకి నో చాన్స్..

వచ్చే సీజన్‌లో డివిలియర్స్‌ని బెంగళూరు రిటైన్‌ చేసుకోదని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు..'అవును. రిటైన్‌ చేసుకోదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి అతడి రిటైన్‌ చేసుకుంటుందని అనుకుంటున్నా. డివిలియర్స్‌కి ఈ అవకాశం లేదు'అని సమాధానమిచ్చాడు. ఏబీ డివిలియర్స్‌ 2011లో ఆర్‌సీబీ జట్టులో చేరాడు. ఇప్పటివరకు 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ.. 5162 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో డివిలియర్స్ 313 పరుగులు చేశాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో ఏబీడీ దారుణంగా విఫలమయ్యాడు. ఇక కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నాలుగు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

కోహ్లీ తొందరపడ్డాడు..

కోహ్లీ తొందరపడ్డాడు..

అయితే కెప్టెన్సీ విషయంలో కోహ్లీ తొందరపడ్డాడని, రాంగ్ టైమ్‌లో సారథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీ ముగిసిన తర్వాత చెప్పాల్సిందన్నాడు. అతని నిర్ణయమే ఆర్‌సీబీ వైఫల్యానికి కారణమైందన్నాడు. 'కోహ్లీ రాంగ్ టైమ్‌లో ప్రకటించాడు. కెప్టెన్సీ వదులుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు టోర్నీ ముగిసిన తర్వాత చెప్పాల్సింది. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరక ముందే చెప్పి ఆ జట్టు ఆటగాళ్లపై ఒత్తిడికి గురిచేసినట్లు అయింది. టోర్నీ ముగిసిన తర్వాత చెప్పాల్సిందనే నా అభిప్రాయం'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, October 13, 2021, 18:13 [IST]
Other articles published on Oct 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X