Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?

టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేకపోవడంతో గత 'మే'లోనే బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది.

ఇప్పటికే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల గడవు ముగిసి నెల రోజులు అవుతున్నా.. హెడ్ కోచ్ నియామకంపై మాత్రం బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఆ జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Gautam Gambhir likely to be announced as Team India s Head Coach by June end

నాకు సమ్మతమే..
అయితే హెడ్ కోచ్ పదవి కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడా? లేదా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. మరోవైపు గౌతమ్ గంభీర్ మాత్రం టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. 'భారత జట్టుకు కోచ్‌గా పనిచేయడం నాకిష్టం. అంతకు మించిన గౌరవం లేదు. మన జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయడం అంటే ఎంతో గౌరవమైన బాధ్యత.

140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం కన్నా మించిన పదవి ఏది లేదు.'అని ఓ కార్యాక్రమంలో గంభీర్ వెల్లడించాడు.


జూన్ చివర్లో అధికారిక ప్రకటన..
గంభీర్ నియామకం పూర్తయిందని, ఈ నెల(జూన్) చివర్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన వస్తుందని తెలిపింది.

టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ కూడా పూర్తిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సపోర్ట్ స్టాఫ్ నియామకం విషయంలో తనకు పూర్తి స్వేఛ్చను ఇవ్వాలనే కండిషన్‌తోనే గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నాడని సదరు పత్రిక తమ కథనంలో ప్రస్తావించింది.

సపోర్ట్ స్టాఫ్‌పై వేటు..?
ప్రస్తుత బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్‌తో పాటు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌లను కూడా మార్చే అవకాశం ఉంది. రవిశాస్త్రి సారథ్యంలో బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విక్రమ్ రాథోడ్.. ద్రవిడ్ హయాంలో కూడా కొనసాగాడు. ద్రవిడ్ తనకు అనువుగా ఉండే సపోర్ట్ స్టాఫ్‌ను ఎంచుకున్నాడు.

భరత్ అరుణ్‌కు బదులు పరాస్ మాంబ్రే, శ్రీధర్‌కు బదులు దిలీప్‌ను సపోర్ట్ స్టాఫ్‌గా నియమించుకున్నాడు. గంభీర్ సైతం తనకు అనుకూలంగా ఉండే వారిని సపోర్ట్ స్టాఫ్‌గా తెచ్చుకుంటాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Story first published: Sunday, June 16, 2024, 12:32 [IST]
Other articles published on Jun 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+