Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బర్త్‌డే వేళ.. రోహిత్ శర్మకు కొత్త బిరుదిచ్చిన గంభీర్

Gautam Gambhir hails Rohit Sharma on his 33rd birthday

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నేటి(గురువారం)తో 33వ పడిలో అడుగుపెట్టాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హిట్‌మ్యాన్ ఈ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుపుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ ముంబై క్రికెటర్‌కు ఫ్యాన్స్, మాజీ, సహచర క్రికెటర్లు, సినీ, రాజకీయ వర్గాలు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌కు విషెస్ తెలియజేస్తూ టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ రోహిత్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఇప్పటి వరకు రోహిత్‌కు హిట్‌మ్యాన్, విధ్వంసకర ఓపెనర్, రోహిట్ అని అభిమానులు ముద్దుగా పిలచుకుంటుండగా.. గంభీర్ మరో పేరు పెట్టాడు. వరల్డ్ బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్ అనే బిరుదిచ్చాడు. రాబోయే ఏడాది మరింత గొప్పగా ఆడాలని ఆకాంక్షించాడు.

రోహిత్‌తో తాను కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన గంభీర్ 'వరల్డ్ బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే ఏడాది మరింత గొప్పగా ఆడాలి' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే రోహిత్ ఓపెనర్ అవతారం ఎత్తిన తర్వాతే గంభీర్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. అంతేకాకుండా రోహిత్, ధావన్ జోడీ ఓపెనింగ్‌లో మంచి ఫలితాలు రాబడుతుండంతో గంభీర్‌తో పాటు సెహ్వాగ్ కూడా తన కెరీర్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది.

ఇక రోహిత్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్ హిట్‌మ్యాన్ అని, అతను అందించిన ట్రోఫీలే ఈ విషయాన్ని తెలియజేస్తాయన్నాడు. జట్టును ఎన్నిసార్లు విజేతగా నిలిపామన్నదే కెప్టెన్సీ సత్తా తెలియజేస్తుందన్నాడు. క్రికెట్ నుంచి త‌ప్పుకునేలోపు అత‌డు మ‌రో మూడు ట్రోఫీలైనా సులువుగా త‌న ఖాతాలో వేసుకుంటాడ‌ని ఈ మాజీ ఓపెనర్ జోస్యం చెప్పాడు.

2007 టీ20 ప్రపంచకప్‌ వేదికగా మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించిన హిట్ మ్యాన్.. కెరీర్ ఆరంభంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అనంతరం రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ ధోనీ చేసిన ప్రయత్నం ఫలించడంతో హిట్‌మ్యాన్‌కు తిరుగే లేకుండా పోయింది. అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే మూడు డబుల సెంచరీలు బాదిన రోహిత్.. గతేడాది కూడా తన జోరు చూపించాడు.

Story first published: Thursday, April 30, 2020, 19:16 [IST]
Other articles published on Apr 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+