న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాన్న ఇలానే రనౌట్ అవుతాడు'

Gautam Gambhir Trolls Himself Over His Lazy Childish Run Out | Oneindia Telugu
Gautam Gambhir Gets Run-Out Like A Kid, Trolls Himself

హైదరాబాద్: క్రికెటర్ గానే కాదు.. వ్యక్తిగతంగానూ అందరికంటే భిన్నంగా వ్యవహరించే టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ గంభీర్ భిన్నంగా ట్వీట్ చేస్తూ.. వార్తల్లో నిలిచాడు. 'చిల్డన్స్ డే'ను పోలుస్తూ.. గంభీర్ ఈ ట్వీట్ చేశాడు. ఇలా ఈ ఢిల్లీ క్రికెటర్ గంభీర్‌ తనపై తానే వ్యంగ్య బాణం విసురుకున్నాడు. చిన్న పిల్లల క్రికెట్‌లో మాదిరిగా రనౌట్‌ కావడంతో ఇలా చేశాడు. ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అతడు తన బద్ధకంతో రనౌట్‌ అయ్యాడు.

సులభంగానే పరుగు తీసినా క్రీజులో మాత్రం

సులభంగానే పరుగు తీసినా క్రీజులో మాత్రం

ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సులభంగానే పరుగు తీసినా క్రీజులో మాత్రం బ్యాటు ఉంచలేదు. దీంతో బౌలర్‌ రిషి ధావన్‌ బంతి అందుకొని వికెట్లకు గిరాటేశాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ ఓ ట్వీట్‌ చేశాడు.

రంజీ మ్యాచ్‌లో చిన్న పిల్లాడిలా

‘ఆజీన్‌తో అనైజా: అక్కా, నాన్న బాలల దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటాడు? ఆజీన్‌ జవాబు: ఎలాగంటే... ఈ రోజు రంజీ మ్యాచ్‌లో చిన్న పిల్లాడిలా ఔటైనట్టు!' అని గంభీర్‌ తనపై సెటైర్‌ వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ గంభీర్‌కు అంతగా కలిసిరానట్లుంది. తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన గౌతంని అంపైర్‌ పొరపాటున ఔట్‌గా ప్రకటించాడు. దాంతో అతడు అంపైర్‌ను పదేపదే చూస్తూ అరుస్తూ పెవిలియన్‌ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు.

ఉద్యోగం లేకపోయినా ఆడగలననే నమ్మకముంది : కోహ్లీ

గంభీర్‌ను డేర్‌డెవిల్స్ జట్టు విడిచి

గంభీర్‌ను డేర్‌డెవిల్స్ జట్టు విడిచి

అదలా ఉంచితే.. ఇటీవల విడుదల చేసిన జాబితాను బట్టి.. గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు విడిచిపెట్టేసింది. ఇలా వేలానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్లలో గంభీర్ కూడా చేరిపోయాడు. గంభీర్‌తో పాటు మరో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను కూడా జట్టు విడిచిపెట్టేయడంతో వేలానికి అందుబాటులో ఉన్నాడు.

గంభీర్.. బాధ్యతల నుంచి వైదొలగడంతో

గంభీర్.. బాధ్యతల నుంచి వైదొలగడంతో

ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతం గంభీర్.. బాధ్యతల నుంచి వైదొలగడంతో అతనిస్థానంలో నితీశ్ రానాను కెప్టెన్‌గా తీసుకున్నారు. అంతకంటే ముందు కెప్టెన్సీ వదులుకున్న గౌతం.. రంజీ జట్టులో కొనసాగలేనని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ను అభ్యర్థించినా లాభం లేకుండాపోయింది.

Story first published: Friday, November 16, 2018, 10:59 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X