విశ్వ విజేతగా టీమిండియా.. గంభీర్ ఏమన్నాడంటే..?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. మెగా టోర్నీలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడోసారి టైటిల్ నెగ్గి తీన్‌మార్ కొట్టింది. విశ్వవేదికపై మువ్వెన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో అద్వితీయమైన ప్రదర్శనతో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయం వెనుక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఎంతో ఉంది. అతని నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చినా.. కోచ్‌గా గంభీర్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.
ఈ టోర్నీకి ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐదుగురు స్పిన్నర్లు ఎందుకంటూ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించినా.. తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి ఫలితాన్ని రాబట్టాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు వచ్చినా.. రిషభ్ పంత్‌ను ఆడించకపోవడాన్ని తప్పుబట్టినా గంభీర్ పట్టించుకోలేదు. కోచ్‌గా తాను చేయాల్సింది చేశాడు. ఈ టోర్నీ ఆసాంతరం ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉంటూ జట్టును జగజ్జేతగా నిలబెట్టాడు.

హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన 9 నెలల కాలంలోనే ఐసీసీ టైటిల్ అందుకున్న గంభీర్.. ఓ చిరునవ్వుతో ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. హెడ్ కోచ్‌గా తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించానని సైలెంట్‌గా నిలబడిపోయాడు. ఈ విజయంపై కూడా పెద్దగా స్పందించలేదు. హిందీ కామెంటేటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ బలవంతం చేయడంతో డ్యాన్స్ చేసి అతనితో మాట్లాటాడు. అంతే తప్పా జట్టు సంబరాలకు దూరంగా ఉన్నాడు.
ఈ విజయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న పోస్ట్ పెట్టాడు. ఈ విజయాన్ని భారత ప్రజలకు అంకితం చేశాడు. '140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు.. జైహింద్'అనే క్యాప్షన్‌తో టీమిండియా సంబరాలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు.
Congratulations to 1.4 billion Indians! Jai Hind 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/fhIxRjKtkH
— Gautam Gambhir (@GautamGambhir) March 9, 2025
Gautam Gambhir has some dance moves with Navjot Singh Sidhu 😂❤️ pic.twitter.com/FoLIIYOJIm
— Nikhil (@TheCric8Boy) March 9, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications