CSK vs MI ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచేది ఆ జట్టే: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ సందడి మొదలైంది. ఎన్నో ఆటంకాలు.. మరెన్నో అడ్డంకులను అధిగమించిన ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. కరోనా దెబ్బకు భారత్‌ను వదిలి యూఏఈకి తరలిన ఈ ధనాధన్ లీగ్.. ఎడారి హీట్‌లో.. అరేబియన్ నైట్స్‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చగా పరుచుకున్న మైదానాల్లో అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. ఢిపెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది.
గత సీజన్ ఫైనల్లో ఒక్క పరుగుతో సీఎస్‌కేను ఓడించిన ముంబై ఇండియన్స్ నాలుగో టైటిల్‌ను ముద్దాడింది. దీంతో ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి అంతకంతకు బదులు తీర్చుకోవడంతో పాటు ఐపీఎల్ 2020ని ఘనంగా ప్రారంభించాలని మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే భావిస్తోంది. కానీ ఈ ఆరంభ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.

వారెలా బౌలింగ్ చేస్తారని..
తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న ఈ మాజీ ఓపెనర్.. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌ను విశ్లేషించాడు. ‘కొత్త బంతితో ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తారోనని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఎందుకుంటే ఈ ఇద్దరు వరల్డ్ క్లాస్ బౌలర్స్. టీ20 క్రికెట్‌లో వికెట్ల పడగొట్టగలిగే సమర్థులు. కుడిచేతి బ్యాట్స్‌మెన్‌ను లెఫ్టార్మ్ పేసర్ అయిన ట్రెంట్ బౌల్ట్ ఇబ్బంది పెడితే.. బుమ్రా తన అసాధారణ బౌలింగ్‌తో ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలడు.

చెన్నైకి సవాలే..
ఈ ఇద్దరిని ఎదుర్కోవడం చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద సవాలే. ఎందుకంటే వారికి నెంబర్ 3లో సురేశ్ రైనా లేడు. అంతేకాకుండా షేన్ వాట్సన్ ఎక్కువ క్రికెట్ ఆడలేదు. ఈ పరిస్థితుల్లో అతను వారిని ఎలా ఎదుర్కొంటాడనేదే ఆసక్తికరం. అలాగే అతను ఎవరితో బ్యాటింగ్ ప్రారంభిస్తాడో కూడా చూడాలి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్సే పై చేయి సాధిస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకుంటే ఆ జట్టు బలమైన ఆటగాళ్లతో సమతూకంగా ఉంది.

బౌల్ట్ చెలరేగితే..
ట్రెంట్ బౌల్ట్ వారికి మంచి అవకాశం. అతను కొత్త బంతితో రాణిస్తే పరిస్థితులకు అనుగుణంగా బుమ్రాను ఉపయోగించుకోవచ్చు. అందుకే వారిద్దరు ఎలా ఆడుతారోనని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ ఫస్ట్ మ్యాచ్‌లోనే కాదు ఈ టోర్నీ ఆసాంతం ఎలా రాణిస్తారోనని ఎదురు చూస్తున్నా.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్ ఐదో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. ప్రతికూల పరిస్థితుల మధ్య డాడీస్ ఆర్మీ చరిత్ర సృష్టించాలనుకుంటుంది. ప్రారంభ మ్యాచ్‌తోనే తమసత్తా చాటాలని భావిస్తోంది.
IPL 2020 ప్లే ఆఫ్‌కు ఆ నాలుగు జట్లు.. ఆర్‌సీబీకి నో చాన్స్: స్కాట్ స్టైరిస్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications