చరిత్ర సృష్టించిన గౌతమ్ గంభీర్.. తొలి కోచ్‌గా రికార్డ్!
టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే రెండు ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్ గెలిచిన తొలి కోచ్‌గా చరిత్రకెక్కాడు. మరే జట్టు కోచ్ కూడా గంభీర్‌లా రెండు ఐసీసీ టైటిల్స్ గెలవలేదు. గౌతమ్ గంభీర్ ఆటగాడిగా 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ రెండు టోర్నీల ఫైనల్లో గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జరిగిన ఫైనల్లో గంభీర్ 75 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో క్లిష్టపరిస్థితుల్లో 97 పరుగులు చేశాడు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంతో కొత్త కోచ్‌గా అందరూ ఊహించిన గంభీర్‌నే బీసీసీఐ నియమించింది. గంభీర్ నియామకం సంబంధించి మంగళవారమే బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. 43 ఏళ్ల గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శ జై షా వెల్లడించాడు.
అశోక్ మల్హోత్ర, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడా త్రిసభ్య క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది.
ఈ నెల 27న టీమిండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన నుంచే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించనున్నాడు. శ్రీలంక గడ్డపై భారత జట్టు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పదవి కాలం డిసెంబర్ 2027 వరకు కొనసాగనుంది.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2024, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25, టీ20 ప్రపంచకప్ 2026, వన్డే ప్రపంచకప్ 2027 వంటి కీలక టోర్నీలు ఆడనుంది.
2014-2012 వరకు టీమిండియా ఆటగాడిగా మూడు ఫార్మాట్లలో కొనసాగిన గంభీర్.. ఓపెనర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 58 టెస్ట్‌ల్లో 4154 పరుగులు చేసిన అతను 9 శతకాలు, 22 అర్థ సెంచరీలు చేశాడు. 147 వన్డేల్లో 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 5238 పరుగులు సాధించాడు. 37 అంతర్జాతీయ టీ20ల్లో 7 హాఫ్ సెంచరీలతో 932 రన్స్ చేశాడు.
కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా అనుభవం లేకపోయినా.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఆ జట్టును రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా.. ఆ జట్టు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతోనే గంభీర్‌కు బీసీసీఐ హెడ్ కోచ్ బాధ్యతలను కట్టబెట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications