Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌతమ్ గంభీర్‌పై ఫిర్యాదు!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జట్టులో తమ భవిష్యత్తుపై పెద్దలతోనే తేల్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీనియర్లతో అతనికి కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారానికి తగ్గట్లుగానే టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్ట్ క్రికెట్‌ నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు తప్పుకోవడానికి గౌతమ్ గంభీరే ప్రధాన కారణమని ప్రచారం జరిగింది.

అలా టెస్టుల్లో.. టీ 20ల్లో భారత జట్టుపై పట్టు సాధించిన గంభీర్ వన్డేల్లో మాత్రం తన మాటను నెగ్గించుకోలేకపోయాడు. వన్డే ప్రపంచకప్‌ 2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం వారి స్థానాలపై హామీ ఇవ్వలేదు.

Gautam Gambhir Bypassed Senior Indian Cricketers Reportedly Approach BCCI Directly to Discuss ODI Future

వరల్డ్‌ కప్‌ ఆడే విషయంలో రోహిత్ కోహ్లీలకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్‌ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు. ఇందుకు కోహ్లీ కూడా ఇటీవలే గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని స్పష్టం చేశాడు.

ఇక సీనియర్‌ ఆటగాళ్లు గంభీర్‌, అగార్కర్‌లను కాదని బీసీసీఐ ఉన్నతాధికారులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. 'జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వన్డే జట్టు విషయంలో కెప్టెన్‌ గిల్‌ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్‌ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాలు మొదలయ్యాయి.

ఇకపై గంభీర్‌-గిల్‌ మరి కాస్త కఠినంగా మారవచ్చు. సుదీర్ఘ కాలం జట్టుకు సేవలు అందిస్తున్న సీనియర్లు రానున్న కాలంలో జట్టులో తమ పాత్ర ఏంటన్న అంశం గురించి గంభీర్‌తో కాకుండా నేరుగా బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు' అని సదరు అధికారి వెల్లడించారు.

Story first published: Wednesday, June 10, 2026, 19:41 [IST]
Other articles published on Jun 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+