Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిక్కుల్లో సర్ఫరాజ్ ఖాన్.. లీకు వీరుడిపై గంభీర్ ఆగ్రహం!

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అతనిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ విషయాలను మీడియాకు లీక్ చేసేది సర్ఫరాజ్ ఖాన్ అని గంభీర్ సందేహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్ టెస్ట్ పరాజయం అనంతరం గంభీర్.. ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

సీనియర్, జూనియన్ అనే తేడా లేకుండా గంభీర్ అందర్నీ క్లాస్ పీకినట్లు ప్రచారం జరిగింది. 'ఇక చాలు.. ఇప్పటికే చాలా చేశారు'అని గంభీర్ ఆటగాళ్లను మందలించినట్లు వార్తలు హల్‌ఛల్ చేశాయి. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే ప్రతీ విషయం బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Gautam Gambhir Blames Sarfaraz Khan For Dressing Room Leaks During Austraila Tour

డ్రెస్సింగ్ రూమ్ సంభాషణ అక్కడికి పరిమితం కావాలని, మీడియాకు తెలియడం ఏంటని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్ కూడా ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్‌లో స్పందించాడు. ఇలా డ్రెస్సింగ్ రూమ్ విషయాలను లీక్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న గంభీర్.. అంతర్గత విచారణ చేపట్టినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. లీకు వీరుడిని కనిపెట్టడంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సంభాషణను సర్ఫరాజ్ ఖాన్ లీక్ చేసి ఉంటాడని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ సర్ఫరాజ్ ఖానే ఈ వ్యవహారంలో దోషిగా తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జట్టులోకి రావడానికి చాలా కష్టపడిన సర్ఫరాజ్ ఖాన్.. అనవసర విషయాల్లో తలదూర్ఛి కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దేశవాళీ టోర్నీల్లో రికార్డుల మీదు రికార్డులు నెలకొల్పినా సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను పట్టించుకోలేదు. ఫిట్‌నెస్ సమస్యలు కారణంగా చూపించి అతన్ని ఎంపిక చేయలేదు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్.. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో అవకాశాన్ని అందుకొని సత్తా చాటాడు. 6 టెస్ట్‌ల్లో ఒక శతకంతో పాటు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

Story first published: Thursday, January 16, 2025, 18:43 [IST]
Other articles published on Jan 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+