Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేకేఆర్‌కు గౌతమ్ గంభీర్ గుడ్‌బై..!

టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్ గౌతమ్ గంభీర్ సిద్దమయ్యాడు. ఇప్పటికే గంభీర్‌ నియామకం పూర్తవ్వగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల చివర్లో టీమిండియా మూడేసి వన్డేలు, టీ20ల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.

ఆ సమయంలోనే కొత్త కోచ్ పేరును ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో స్వీకరించనున్నాడు. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్ బాధ్యతలకు గంభీర్ గుడ్‌బై చెప్పనున్నాడు.

Gautam Gambhir Bids Adieu To KKR With Emotional Farewell Shoot At Kolkata

ఈ నేపథ్యంలోనే తమకు టైటిల్ అందించిన గంభీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేసింది. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ ఫ్రాంచైజీ.. గంభీర్ వీడ్కోలుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక వీడియో షూట్‌ను కూడా ప్లాన్ చేసింది. ఈ వీడ్కోలు వీడియో షూట్‌లో పాల్గొనేందుకు గౌతమ్ గంభీర్ శుక్రవారం కోల్‌కతాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం కేకేఆర్‌కు ఆడిన గంభీర్ కెప్టెన్‌గా 2012, 2014 సీజన్ల టైటిళ్లను అందించాడు. సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ మెంటార్‌గా మళ్లీ కేకేఆర్ జట్టులోకి వచ్చిన గంభీర్..ఇటీవల ముగిసిన సీజన్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 10 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం రావడంతో గంభీర్.. తప్పని పరిస్థితుల్లో కేకేఆర్‌‌కు వీడ్కోలు పలుకుతున్నాడు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏక కాలంలో రెండు జట్లకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం లేదు. దాంతోనే కేకేఆర్‌ను వీడాల్సిన పరిస్థితి గంభీర్‌కు వచ్చింది. గంభీర్ ఫేర్‌వెల్ వీడియో షూట్‌కు సంబంధించిన వివరాలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు మీడియాతో పంచుకున్నారు.

'శుక్రవారం కేకేఆర్ ఫ్రాంచైజీ తీసిన ఫేర్‌వెల్ వీడియో షూట్‌కు గంభీర్ హాజరయ్యాడు. కేకేఆర్ అభిమానులకు అతను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పాడు.'అని సదరు అధికారి తెలిపాడు.

ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా బీసీసీఐ ప్రకటించిన వెంటనే కేకేఆర్ గంభీర్‌కు సంబంధించిన ఫేర్‌వెల్ వీడియోను అభిమానులతో పంచుకోనుంది. అయితే కేకేఆర్ ఫ్రాంచైజీ అధికారులు మాత్రం గంభీర్ పర్సనల్ టీమ్ ఫేర్‌వెల్ వీడియో షూట్ చేసిందని, ఫ్రాంచైజీకి సంబంధం లేదని పేర్కొన్నారు.

Story first published: Saturday, July 6, 2024, 14:59 [IST]
Other articles published on Jul 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+