Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ గంభీర్ X కోహ్లీ డిష్యూం డిష్యూం? (వీడియో)

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు మాట్లాడుకోవడం లేదనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

నేడు(జూలై 14)బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి వన్డే‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు బాగా సన్నదమయ్యారు. నెట్స్‌లో గంటల తరబడి చెమటోడ్చారు. అయితే ప్రాక్టీస్ సెషన్స్‌లో కోహ్లీ, గంభీర్ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదనే పోస్ట్‌లు సోషల్ మీడియా వేదికగా హల్‌ఛల్ చేస్తున్నాయి.

IND vs ENG 1st ODI: గంభీర్.. ఆ దద్దమ్మను పక్కన పెట్టు!

IND vs ENG 1st ODI: గంభీర్.. ఆ దద్దమ్మను పక్కన పెట్టు!

కోహ్లీతో మాట్లాడిన గంభీర్..

విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్ సెషన్‌ను ప్రత్యేకంగా గమనించిన గంభీర్.. అతనితో నేరుగా మాట్లాడకుండా బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్‌కు చెప్పి మరీ మాట్లాడించడం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో అనవసర షాట్స్ ఆడబోయిన కోహ్లీ పలుమార్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత కోహ్లీతో గంభీర్ నేరుగా మాట్లాడకుండా బ్యాటింగ్‌ కోచ్‌తో మాట్లాడించడం ఈ విభేదాల వార్తలకు బలం చేకూరుస్తోంది.

Gautam Gambhir and Virat Kohli Avoid Each Other During India s Practice Session Ahead of 1st ODI vs England

ఒక్కసారి మాట్లాడుకోలేదు..

ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా గంభీర్ తరుచూ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. నేరుగా కోహ్లీతో గంభీర్ మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదని ఓ జాతీయ మీడియా పేర్కొది.

ఫైనల్ ప్రాక్టీస్ సెషన్‌లో జట్టులోని ఇతర ఆటగాళ్లందరితో మాట్లాడిన గంభీర్.. కోహ్లీతో మాత్రం మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. కోహ్లీ కూడా గంభీర్‌తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దాంతో జట్టులో వాతావరణం అంతా సవ్యంగానే ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

ఇక గెలిచినట్టే..

గతంలో ఐపీఎల్ సందర్భంగా పలుమార్లు ఈ ఇద్దరూ గొడవపడ్డారు. కానీ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రొఫెషనల్ ప్లేయర్లలా కలిసి మెలిసి పనిచేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదనే వార్తలు అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ఇప్పటికే టీ20ల్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. కనీసం వన్డేల్లోనైనా గెలవాలని భావిస్తుంది. ఈ క్రమంలో కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు మ్యాచ్‌ల ఫలితాలపై ఏ మేర ప్రభావం చూపుతాయోననే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

Story first published: Tuesday, July 14, 2026, 15:16 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+