Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NAM: ఉచ్చులో పడిన సంజూ శాంసన్.. నవ్వు ఆపుకోలేకపోయిన గ్యారీ కిర్‌స్టన్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఔటవ్వడాన్ని చూసి ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నవ్వు ఆపుకోలేకపోయాడు. తమ ఆటగాళ్లతో రచించిన వ్యూహంలో సంజూ శాంసన్ చిక్కడంతో ముసిముసి నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ అనారోగ్యంతో దూరమవడంతో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 8 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. నమీబియా బౌలర్ బెన్ షికోంగో వేసిన బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడగా.. డీప్ మిడ్ వికెట్‌లో లారెన్ స్టీన్‌క్యాంప్ అందుకున్నాడు. ఇలా ఊరించే బంతితో సంజూ శాంసన్‌ను బోల్తా కొట్టించాలని గ్యారీ కిర్‌స్టన్ తమ ఆటగాళ్లకు చెప్పి ఉంటాడు. దాంతోనే సంజూ ఔటవ్వగానే ముసిముసి నవ్వాడు.

Gary Kirsten Viral Reaction Sanju Samson Falls into Namibia s Trap in T20 World Cup 2026

వ్యూహం ఫలించడంతో..

సంజూ పెవిలియన్ చేరుతుండగా.. టీవీ కెమెరాలు నమీబియా డగౌట్‌ను చూపించాయి. నమీబియా కన్సల్టెంట్, టీమిండియా మాజీ కోచ్ అయిన గ్యారీ కిర్‌స్టన్ నవ్వుతూ కనిపించాడు. గ్యార్ కిర్‌స్టన్ సాధారణంగా తన భావోద్వేగాలను బయటపెట్టడు. కానీ తన ప్లాన్ సక్సెస్ కావడంతో సంతోషంతో నవ్వు ఆపుకోలేకపోయాడు. అమెరికాతో మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ ఇదే తరహాలో ఔటయ్యాడు. ఇప్పుడు సంజూ శాంసన్ కూడా స్లో బాల్‌కే వెనుదిరిగాడు.

అభిషేక్ శర్మ గైర్మాజరీలో దక్కిన బంగారం లాంటి అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సంజూ విఫలమైనా.. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు

అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు స్టీన్ కాంప్(29), జాన్ ఫ్రిలింక్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/7) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/21), అక్షర్ పటేల్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు.

Story first published: Friday, February 13, 2026, 11:49 [IST]
Other articles published on Feb 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+