గ్యారీ కిర్‌స్టన్ సలహా.. నెక్ట్స్ మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ సెంచరీ బాదిన కోహ్లీ!!

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్.. టీమిండియా ఉత్తమ కోచ్‌లలో ఒకడు. 2007లో వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ అనంతరం భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. 2009లో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. రెండేళ్ల తర్వాత.. 28 సంవత్సరాలుగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను అందించాడు. సచిన్ టెండూల్కర్ వంటి స్టార్ ఆటగాడు, విరాట్ కోహ్లీ వంటి యువ ప్లేయర్ మధ్య సమతుల్యతను తీసుకొచ్చి గొప్పగా రాణించాడు.

కోహ్లీకి గ్యారీ సలహా
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో మొదటి మీటింగ్‌లో తాను ఒక్క మాటే చెప్పినట్లు టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తెలిపాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఆరంభంలో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. బంతిని బాగానే మిడిల్ చేస్తున్నా.. గాల్లోకి లేపేయం ఓ బలహీనతగా మారింది. షాట్ సెలక్షన్ గమనించిన గ్యారీ.. కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు. బంతిని గాల్లోకి లేపకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్‌లోనే విరాట్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ బాదాడు.

చాలా ప్రతిభ దాగుందనుకున్నా
తాజాగా యూట్యూబ్ ఛానల్‌తో గ్యారీ కిర్‌స్టన్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు నా ఒకటే అనిపించింది. ఈ కుర్రాడిలో చాలా ప్రతిభ దాగుందనుకున్నా. కానీ సరైన మార్గంలో దాన్ని వినియోగించుకోవడం లేదని మగనించా. ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ సమయంలో విరాట్, నా మధ్య చాలా చర్చలు జరిగాయి. ఆ సిరీస్ మొదటి మ్యాచ్‌లో కోహ్లీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు. కానీ 30+ స్కోరు వద్ద బౌలర్ తలమీదుగా సిక్స్ కొట్టబోయి లాంగాన్‌లో ఫీల్డర్‌కి చిక్కాడు' అని తెలిపాడు.

కోహ్లీకి ఒక్కటే చెప్పా
'ఆ షాట్ ఆడిన తర్వాత నేను విరాట్ కోహ్లీకి ఒక్కటే చెప్పా. నువ్వు నీ ఆటని మరో స్థాయికి తీసుకెళ్లాలంటే.. బంతిని గాల్లోకి లేపకూడదు. బౌండరీ వెలుపలికి బంతిని తరలించే సామర్థ్యం నీలో ఉంది. కానీ ఆ షాట్ రిస్క్‌తో కూడుకున్నది అని వివరించా. ఆ తర్వాత మ్యాచ్‌లో తన ఆటతీరు మార్చుకున్న కోహ్లీ.. ఏకంగా సెంచరీ బాదేశాడు. అదే అతని ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీ కూడా. మంచి షాట్లతో అలరించాడు' అని గ్యారీ కిర్‌స్టన్ వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో గ్యారీ 101 టెస్టుల్లో, 185 వన్డే మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఎంఎస్ ధోనీ చేతిలో సౌరవ్ గంగూలీ ఓటమి!!