For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ganguly vs Virat: విరాట్ కోహ్లీ ప్రెస్‌మీట్.. దోషీగా తేలిన బీసీసీఐ ప్రెసిడెంట్! మండిపడుతున్న ఫ్యాన్స్!

Ganguly vs Virat Kohli: BCCI Is The Culprit Fans Fire On Indian Board
Rohit vs Kohli : I Can’t Fault Two Players - Gavaskar || Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగూలీ అంటే గౌరవం ఉండేదని ఇప్పుడు అది పోయిందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం భారత క్రికెట్‌లో అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదనే సెలెక్టర్లతో కలిసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని విరాట్ కోహ్లీని రిక్వెస్ట్ చేసినా అతను పట్టించుకోలేదన్నాడు. వ్యక్తిగతంగా తాను కూడా విరాట్ కోహ్లీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశానని చెప్పాడు.

బాంబు పేల్చిన కోహ్లీ..

కానీ విరాట్ కోహ్లీ మాత్రం భిన్నంగా చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విరాట్.. కెప్టెన్సీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా 100 శాతం ఎఫర్ట్ పెట్టానని, టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకుంటానని చెప్పినప్పుడు బీసీసీఐ వద్దని చెప్పలేదన్నాడు. టీ20 కెప్టెన్సీ వదులుకున్నా వన్డే, టెస్ట్‌ల్లో కొనసాగుతానని చెప్పానన్నాడు. కానీ టీ20 కెప్టెన్సీ వదులుకుంటే వన్డే సారథ్యం నుంచి కూడా తప్పిస్తామని తనకు ఎవరు చెప్పలేదని, ఐసీసీ ట్రోఫీలు గెలవనందుకే ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మతో కూడా తనకు ఎలాంటి విభేదాల్లేవని, గత రెండేళ్లుగా చెప్పిందే చెప్పి తనకు విసగొస్తుందన్నాడు.

నన్నెవరూ వద్దనలేదు..

టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రత్యేకంగా మీతో మాట్లాడరంట కదా? అన్ని ప్రశ్నించగా.. అదేం లేదని కోహ్లీ బాంబు పేల్చాడు. 'టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని బీసీసీఐకి చెప్పినప్పుడు వద్దని నన్నెవరు వారించలేదు. ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదు. టీమ్ పురోగతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాను. వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని కూడా చెప్పాను. నా నుంచి స్పష్టమైన సమాచారం అందించాను. బీసీసీఐ ఆఫీస్ బేరర్స్‌తో పాటు సెలెక్టర్లకు ఈ విషయం చెప్పాను. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సి వస్తుందని అప్పుడు నాతో ఎవరూ అనలేదు. బహుషా.. ఐసీసీ ట్రోఫీలు గెలవలేదనే ఈ నిర్ణయం తీసుకోవచ్చు.'అని విరాట్ పేర్కొన్నాడు.

దోషిగా తేలిన గంగూలీ..

విరాట్ క్లారిటీ ఇవ్వడంతో సౌరవ్ గంగూలీ దోషీగా తేలాడు. దాంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో ఉంటూ ఇలా అబద్దాలు ఆడటం స్థాయికి తగదని మండిపడుతున్నారు. 'ఈ కెప్టెన్సీ మార్పు వ్యవహారంపై నాకు విరాట్ స్పందన కావాలని గత రెండు మూడు రోజులుగా అరుస్తున్నా. చివరకు అతని స్పందనను ఈ రోజు విన్నాను. టీ20 కెప్టెన్సీ గురించి గంగూలీ అసలు తనతో మాట్లాడనేలేదని విరాట్ చెప్పాడు.అంటే సౌరవ్ గంగూలీ అబద్దాలు చెప్పాడా? దాదా నువ్వే క్లారిటీ ఇవ్వాలి?'అని ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. గంగూలీ చాలా కన్నింగ్ ఉన్నట్టున్నాడు కదా? పైకి కనిపించేంత మంచోడు కాదనిపిస్తుంది అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.

జైషా చేతిలో కీలు బొమ్మ..

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ‌ ఉన్నప్పటికీ అతనికి పూర్తి అధికారాలు లేవని, సెక్రటరీ జైషానే అందరిని ఆడిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. క్రికెట్‌లో కూడా రాజకీయాలు ఎక్కువయ్యాయని, బీజేపీకి అనుకూలంగా ఉండే ఆటగాళ్లకే ప్రాధాన్యత దక్కుతుందంటున్నారు. జైషానే కోహ్లీని తప్పించాడని, ఈ క్రమంలోనే గంగూలీ బలిపశువు అయ్యాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం గంగూలీ హ్యాష్‌టాగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ జర్నలిస్ట్‌లు సైతం గంగూలీ తీరును తప్పుబడుతున్నారు.

Story first published: Wednesday, December 15, 2021, 16:20 [IST]
Other articles published on Dec 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+