న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా దాదా సెంచరీ

Ganguly talks about completing 100 days as BCCI President

ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేటితో(జనవరి 23) 100 రోజులు పూర్తిచేసుకున్నాడు. అనూహ్యంగా రేసులోకి వచ్చిన దాదా అక్టోబర్ 23న బీసీసీఐ పగ్గాలందుకున్న విషయం తెలిసిందే.

బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలనను అందిస్తున్న ఈ మాజీ కెప్టెన్.. కీలక నిర్ణయాలతో దూసుకెళ్తున్నాడు. ఓ ఆటగాడిగా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా అనుభవం ఉన్న దాదా.. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కానీ సమస్యలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.

కీపర్‌గా రాహులే ఎందుకు? కోహ్లీ వ్యూహం ఏంటి?కీపర్‌గా రాహులే ఎందుకు? కోహ్లీ వ్యూహం ఏంటి?

డేనైట్ టెస్ట్..

డేనైట్ టెస్ట్..

ఎన్నో రోజులుగా డేనైట్ టెస్ట్‌లకు ససేమిరా అంటున్న భారత జట్టుతో పింక్ బాల్ మ్యాచ్ ఆడించాడు. ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించి అనంతరం బంగ్లాదేశ్‌ను సిద్ధం చేసి సొంతగడ్డపై చారిత్రాత్మక టెస్ట్ నిర్వహించాడు. ఈడెన్ మైదానమంతా గులాబీతో గుబాళించి.. కనివినీ ఎరుగని రీతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాడు. తన పాలన సత్తా ఏంటో నిరూపించాడు.

బీసీసీఐ రాజ్యంగాన్ని సవరించే ప్రయత్నాలు చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అతిపెద్ద సమస్యగా మారిన పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశానికి సంబంధించిన నిబంధనలను మార్చే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుత టార్గెట్స్ ఇవే..

ప్రస్తుత టార్గెట్స్ ఇవే..

ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా 100 రోజుల పూర్తిచేసుకున్న సందర్భంగా గంగూలీ ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడాడు. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడమేనని చెప్పుకొచ్చాడు. నాలుగు పెద్ద దేశాల రెవెన్యూ విధానాన్ని కూడా సరిచేయాలన్నాడు.

2008లో రిటైర్మెంట్:

2008లో రిటైర్మెంట్:

గంగూలీ కెరీర్‌లో 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన గంగూలీ.. 1996లో టెస్ట్‌ల్లో ఆడడం ప్రారంభించాకే అతని కెరీర్ కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్‌లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్‌ చీఫ్‌గా ఎన్నికైన గంగూలీ రెండోసారి ఆ పదవి బాధ్యతలు చేపట్టాడు.

Story first published: Thursday, January 23, 2020, 20:54 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X