ఒక్కసారిగా గంగ నుంచి చంద్రముఖి అవతారమెత్తాడు.. కోహ్లీ ఇన్నింగ్స్‌పై అశ్విన్ కామెంట్!

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడిన అశ్విన్.. అతని బ్యాటింగ్ విధానం తనకు 'చంద్రముఖి' సినిమాను గుర్తు చేసిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తొలి 45 బంతుల వరకు నిదానంగా ఆడిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత శివాలెత్తిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన అశ్విన్.. కోహ్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా చంద్రముఖి సినిమాలోని గంగ నుంచి చంద్రముఖి అవతారాన్ని తలపించిందని చెప్పుకొచ్చాడు. గత ఆదివారం జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు అశ్విన్ మైండ్ గేమ్‌తో టీమిండియా సంచలన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే.

చంద్రముఖి సినిమా కనిపించింది..
తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయాం. కోహ్లీ, హార్దిక్ పాండ్యా చెరో 60 పరుగులు చేస్తే తప్ప గెలవలేమనిపించింది. అవసరమైతే నేనూ బ్యాటింగ్‌లో ఒక చేయి వేయాలని అనుకున్నాను. అయితే కోహ్లీ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తొలి 45 బంతుల్లో నిదానంగా ఆడిన అతను ఆ తర్వాత దుమ్మురేపాడు. అతని బ్యాటింగ్ నాకు చంద్రముఖి సినిమాను గుర్తు చేసింది. గంగ నుంచి చంద్రముఖిలా మారినట్లు అనిపించింది.

కార్తీక్‌ను తిట్టుకున్నా..
ఇక నేను చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజులోకి వచ్చాను. ఈ పరిస్థితి నాకు తెచ్చిన దినేశ్ కార్తీక్‌పై చాలా కోపం వేసింది. మనసులో అతన్ని తిట్టుకున్నాను కూడా. అయితే నాకు ఇది మంచి అవకాశంగా భావించా. ఐన్‌స్టీన్ సిద్దాంతం ప్రకారం మనకు ఇష్టం లేని చోట ఉంటే నిమిషం కూడా గంటలా అనిపిస్తోంది. కోహ్లీ వచ్చి ఎక్కడెక్కడ పరుగులు తీయవచ్చో చెప్పాడు. నవ్వు అయితే ఈజీ ఆ షాట్లు ఆడుతావు. నాకు వచ్చిందే చేస్తానని మనసులో అనుకున్నా.

మా ఇంటి రాళ్లు వేయలేరనుకున్నా..
కోహ్లీ వచ్చి లెగ్ స్టంప్ మీదుగా బంతి వేస్తున్నాడు. జరిగి కవర్స్ మీదుగా కొట్టు అని సలహా ఇచ్చాడు. పరిస్థితి ఇంత ఉత్కంఠగా ఉన్నప్పుడు కవర్స్ మీదుగా కొట్టడం ఏంటని అనుకున్నాను. చివరి బంతి దిశను అంచనా వేసి అది వైడ్ బాల్ అని వదిలేశా. ఇక నా ఇంటిపై ఎవరూ రాళ్లు వేయలేరనే ధైర్యం వచ్చింది. కోహ్లీ చేత హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టించిన దేవుడు నన్ను సింగిల్ తీయనియడా? అని అనుకున్నా. చివరకు అదే జరిగింది. ఈ అద్భుతమైన మ్యాచ్‌లో భాగమైనందుకు గర్వంగా అనిపించింది'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications