Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: పాపం జడేజా.. ప్యాంట్ జారిపోయింది!(వీడియో)

ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మైదానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్యాంట్ జారిపోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. సహచర ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు, కామెంటేటర్లు పడి పడి నవ్వుకున్నారు.

అసలేం జరిగిందంటే..?

మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతిని ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ డిఫెండ్ చేయగా.. బంతి బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. డైవ్ చేసి బంతిని ఆపాడు. అయితే ఈ ప్రయత్నంలో అతని ప్యాంట్ జారిపోయింది. దాంతో అతను నవ్వుల పాలయ్యాడు. స్టేడియానికి వచ్చిన లేడీ ఫ్యాన్స్ సైతం ఈ ఘటనను చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Funny Video Ravindra Jadeja Loses His Pants During IND vs ENG 2nd Test Video Goes Viral

2 బంతుల్లో 2 వికెట్లు..

ఆకాశ్ దీప్ వేసిన మరుసటి ఓవర్‌లో ఇంగ్లండ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ దీప్ వేసిన మూడో ఓవర్‌‌లో బెన్ డకెట్(0), ఓలీ పోప్(0) వరుసగా డకౌటయ్యారు. ఈ ఓవర్ నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో వేయగా డకెట్ పంచ్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి మూడో స్లిప్‌ ఫీల్డర్ శుభ్‌మన్ గిల్‌ దిశగా దూసుకెళ్లగా అతను ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఆ మరుసటి బంతిని కూడా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లోనే వేయగా.. ఓలీ పోప్.. ఫ్లిక్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని సెకండ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ వైపు దూసుకెళ్లింది. అయితే బంతి అతని చేతులు తాకి మిస్సైంది. కానీ రెండో ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ పూర్తి చేశాడు. దాంతో ఇంగ్లండ్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్.. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు తీసి అతను లేని లోటును తీర్చాడు.

భారత్ భారీ స్కోర్..

అంతకుముందు 310/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శుభ్‌మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్(103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసారు.

Story first published: Thursday, July 3, 2025, 22:03 [IST]
Other articles published on Jul 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+