Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి అంపైరింగ్‌రా అయ్యా..!(వీడియో)

హైదరాబాద్: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు సరదా ఘటనలు చోటు చేసుకుంటాయి. ఆటగాళ్లు చేసే పనులు నవ్వులు పూయిస్తుంటాయి. హాఫ్ సెంచరీ, సెంచరీలు సాధించినప్పుడు.. భారీ షాట్లు బాదినప్పుడు.. వికెట్లు తీసినప్పుడు ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటారు.
కొందరు ఆనందం పట్టలేక చిందిస్తే.. మరికొందరు ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తుంటారు.

మైదానంలో ఏం జరిగినా అంపైర్లు మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వరు. కనీసం వారి హావభావాలను కూడా ప్రదర్శించరు. సీరియస్‌గా ఉంటూ తమ నిర్ణయాలను వెల్లడిస్తుంటారు. కొన్నిసార్లు రియాక్ట్ అయినా.. బయటికి కనిపించకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరు అంపైర్లు మాత్రం మైదానంలో తమ మార్క్ చూపించుకుంటారు. ఔట్, ఫోర్, వైడ్, సిక్స్ సిగ్నల్స్ ఇచ్చేటప్పుడు తమదైన శైలిని అనుకరిస్తారు.

Funny video in cricket:

కానీ ఓ మ్యాచ్‌లో బ్యాటర్ బౌండరీ బాదడంతో అంపైర్లు ఇద్దరూ చిందేసారు. బౌండరీ సిగ్నల్ ఇస్తూ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి అంపైరింగ్‌రా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ స్థానిక టెన్నిస్ బాల్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే వీడియో కోసమే ఇలా చేశారనే విషయం అర్థమవుతోంది. రీల్స్, యూట్యూబ్ వీడియో కోసం సీరియస్ జరుగుతున్న మ్యాచ్‌లో చిందేసారు. నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంపైర్లు ఏ ఉద్దేశంతో చేసినా.. ప్రస్తుతం ఇదీ క్రికెట్ ఫన్నీ వీడియోగా నిలిచిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ టోర్నీకి కామెంట్రీ కూడా ఉండటం విశేషం.

హిందీ కామెంట్రీ ఉండటంతో నార్త్ ఇండియాకు సంబంధించి టోర్నీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Story first published: Sunday, August 13, 2023, 17:08 [IST]
Other articles published on Aug 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+