For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 WC 2024 Final: మా గాంధీ తాతనే అవమానిస్తారా... సౌతాఫ్రికాకు దబిడి దిబిడే..!

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఫైనల్ చేరడంపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. ఫైనల్ ప్రత్యర్థి సౌతాఫ్రికాకు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇంగ్లండ్‌తో గురువారం అర్థరాత్రి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) చెలరేగగా.. బౌలింగ్‌లో స్పిన్నర్లు అక్షర్ పటేల్(3/23), కుల్దీప్ యాదవ్(3/19) రఫ్ఫాడించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది.

Funny Memes Go Viral On Social Media ahead of India vs South Africa T20 World Cup 2024 Final

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ గెలుపుతో గత టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలోనే ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.

ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్లతో భారత్‌ను మట్టికరిపించగా.. తాజా మ్యాచ్‌లో రోహిత్ సేన భారీ విజయంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంగ్లండ్ జట్టే కాకుండా వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాపై కూడా టీమిండియా అదిరిపోయే రీతిలో రివేంజ్ తీసుకుంది. సూపర్-8లో ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో ఓడించి సెమీస్‌కు రాకుండా చేసింది.

ఈ క్రమంలోనే మీమర్స్ ఈ కాన్సెప్ట్‌తో మీమ్స్ క్రియేట్ చేసి నవ్వులు పూయిస్తున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహాత్మ గాంధీని అవమానించిన సౌతాఫ్రికాను వదులుతుందా? అనే మీమ్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఈ మీమ్ తెగ వైరల్ అయ్యింది.

ఈ మీమ్‌లో ఒకడు టీమిండియా విజయవంతంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను మట్టికరిపించి అదిరిపోయే రీతిలో ప్రతికారం తీర్చుకుందని అనగా.. సౌతాఫ్రికా టీమ్ 'మనకు టీమిండియాతో ఎలాంటి రివేంజ్‌లు లేవు. మనమ సేఫ్'అని సంతోషపడుతోంది. ఆ వెంటనే టీమిండియా.. 'మా గాంధీ తాతను ట్రైన్ నుంచి గెంటేసారు. మిమల్ని వదులుతామా?'అన్నట్లుగా రూపొందించిన ఈ మీమ్ ఆకట్టుకుంటోంది.

Story first published: Friday, June 28, 2024, 15:10 [IST]
Other articles published on Jun 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+