Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇలాంటి ఫినిషింగ్ ఎప్పుడైనా చూశారా? బ్యాట్స్‌మన్ తెలివిని మెచ్చుకోవాల్సిందే! (వీడియో)

Funny Cricket Video: See What Batsman Did When 2 Runs Required From Last Ball

హైదరాబాద్: యూరోపియన్ క్రికెట్‌కు సంబంధించిన ఓ సరదా వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానుల క్రికెట్ పరిజ్ఞానానికి పరీక్షగా నిలిచింది. గల్లీ క్రికెట్‌ను తలపించిన ఈ సన్నివేశం అభిమానులను నవ్వుకునేలా.. బ్యాట్స్‌మెన్‌ తెలివిని మెచ్చుకునేలా చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. యూరోపియన్ క్రికెట్‌కు సంబంధించిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో పీసీఆర్ అనే జట్టు విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఆ చివరి బంతిని పాయింట్ దిశగా ఆడి సింగిల్‌కు పరుగెత్తాడు.

బంతిని అందుకున్న ఫీల్డర్ నేరుగా కీపర్ చేతికి అందించాడు. అయితే అప్పటికే నాన్ స్ట్రైకర్ బ్యాట్స్‌మన్ క్రీజును చేరుకున్నాడు. అయితే ఇక్కడ ఆ బ్యాట్స్‌మన్ తన తెలివిని ప్రదర్శించాడు. అతను బ్యాట్‌ను అలానే క్రీజులో ఉంచి.. కీపర్ బంతిని వికెట్లకు కొట్టి సంబరాలు చేసుకుంటుండగా.. నాన్‌స్ట్రైకర్‌ వైపు నుంచి రెండో పరుగుకు వస్తున్న బ్యాట్స్‌మన్‌ను అలర్ట్ చేసి పరుగు పూర్తి చేశాడు. దాంతో ఆ జట్టు విజయాన్నందుకుంది. అత్యుత్సాహం ప్రదర్శించిన యూసీసీ జట్టు విచిత్రకరమైన పరిస్థితుల్లో ఓటమిపాలైంది.

ఈ వీడియోను నిఖిల్ అనే ఓ క్రికెట్ అభిమాని ట్వీట్ చేయగా వైరల్ అయ్యింది. పెద్ద చర్చకు దారి తీసింది. బంతిని కీపర్ అందుకున్న తర్వాత డెడ్ అయినట్లేగా.. అలా ఎలా పరుగు తీస్తారని చాలా మంది ప్రశ్నించారు. అయితే వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. కీపర్ చేతులో బంతి ఉండగానే నాన్‌స్ట్రైకర్ మరో పరుగు కోసం వస్తున్నాడు. ఇది గమనించని కీపర్ మూల్యం చెల్లించుకున్నాడు. తెలివిగా వ్యవహరించిన బ్యాట్స్‌మెన్ విజయాన్నందుకున్నారని చాలా మంది నిపుణులు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ వీడియోపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. దీ ప్రాగ్ లీగ్ చాలా సరదాగా ఉంటుందని కామెంట్ చేశాడు. క్రెఫెల్డ్ లీగ్ బాగుంటుందన్నాడు. ఇక గల్లీ క్రికెట్‌లో ఇలాంటివి చాలా కామన్ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, May 19, 2021, 17:06 [IST]
Other articles published on May 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+