Funniest Cricket Catch: 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే'! (వీడియో)
Funniest Cricket Catch Ever: క్రికెట్ చరిత్రలో ఎన్నో ఫన్నీ క్యాచ్‌లు చూసి ఉంటారు. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ క్యాచ్‌ను చూస్తే మాత్రం నోరెళ్లబెట్టడంతో పాటు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఇలా కూడా క్యాచ్ పడతారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. కేరళలో చోటు చేసుకున్న ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
కేరళ ప్రీమియర్ లీగ్(కేపీఎల్) టెన్సిస్ బాల్ టోర్నీలో భాగంగా కేపీఏ 123, కేసీఎస్‌ఏ క్యాలీకట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫన్నీ క్యాచ్ ఘటన చోటు చేసుకుంది. కేసీఎస్‌ఏ ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతిని బౌలర్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. బ్యాటర్ కవర్స్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు.

కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. స్లిప్ ఫీల్డర్ లేకపోవడంతో వికెట్ కీపర్ తన కుడివైపు ఫుల్ లెంగ్త్ డైవ్ చేశాడు. ఇక బంతి తన గ్లోవ్స్‌ను తాకి బౌన్స్ అయ్యి అతని వీపుపై పడి ఆగింది. బంతి ఆగడాన్ని గుర్తించిన వికెట్ కీపర్ కదలకుండా ఉండగా.. సహచర ఆటగాళ్లు బంతిని తీసుకొని అప్పీల్ చేశారు. బంతి నేలకు తాకకపోవడంతో అంపైర్ ఔటిచ్చాడు. ఈ క్యాచ్‌ను చూసి కేపీఏ 123 ఆటగాళ్లు పడి పడి నవ్వుకున్నారు. ఫ్యాన్స్ అయితే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ కీపర్ క్యాచ్ అని ప్రశంసిస్తున్నారు.
ఈ క్యాచ్‌తో కుప్పకూలిన కేసీఎస్ఏ క్యాలికట్ టీమ్ ఇన్నింగ్స్ 32 పరుగులకే ముగిసింది. అనంతరం కేపీఎ 123 టీమ్ 4.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఈ వీడియోను ప్లే చేయగా.. కామెంటేటర్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications