
టాప్‌లేపిన అయ్యర్, హర్షల్ పటేల్..
ఆక్షనర్ కిందపడి మెగా వేలం ఆగిపోయే సమయానికి అమ్ముడు పోయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే శ్రేయస్ అయ్యర్, హర్షల్ పటేల్, కగిసో రబడా అత్యధిక ధరను సొంతం చేసుకున్నారు. హర్షల్ పటేల్‌ను ఏకంగా రూ. 10.75 కోట్లు భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతను రూ. 20 లక్షల కనీస ధరకే ఆర్‌సీబీకి ఆడాడు. ఏకంగా 9 రెట్ల డబ్బులను అదనంగా అందుకున్నాడు. ఇక గత సీజన్‌లో హర్షల్ పటేల్ ఆర్‌సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

రబడా, హోల్డర్ సైతం..
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా, జాసన్ హోల్డర్ కూడా భారీ ధర పలికారు. రబడాను తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తికనబర్చడంతో అతని ధర అమాంతం పెరిగింది. ఇక రబడా కోసం తెగించిన పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. షిమ్రాన్ హెట్‌మైర్ రూ.8.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్.. శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.8,25 కోట్లకు కొనుగోలు చేశాయి. స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(రూ.8 కోట్లు)ను రాజస్థాన్ రాయల్స్, నితీశ్ రాణాను(రూ.8 కోట్లు)ను కేకేఆర్ తిరిగి కొనుగోలు చేసింది.

టాప్ లేపిన క్రికెటర్లు...
| ప్లేయర్ | దేశం | బేజ్ ప్రైజ్ | విన్నింగ్ బిడ్ | టీమ్ |
| శ్రేయస్ అయ్యర్ | భారత్ | రూ.2 కోట్లు | రూ. 12.75 కోట్లు | కేకేఆర్ |
హర్షల్ పటేల్
| భారత్ | రూ.2 కోట్లు | రూ.10.75 కోట్లు | ఆర్‌సీబీ | |
| కగిసో రబడా | సౌతాఫ్రికా | రూ.2 కోట్లు | రూ.9.25 కోట్లు | పంజాబ్ కింగ్స్ |
| జాసన్ హోల్డర్ | వెస్టిండీస్ | రూ.1.50 కోట్లు | రూ.8.75 కోట్లు | లక్నో సూపర్ జెయింట్స్ |
| షిమ్రాన్ హెట్‌మైర్ | వెస్టిండీస్ | రూ.1.50 కోట్లు | రూ.8.50 కోట్లు | రాజస్థాన్ రాయల్స్ |
| శిఖర్ ధావన్ | భారత్ | రూ.2 కోట్లు | రూ.8.25 కోట్లు | పంజాబ్ కింగ్స్ |
| ట్రెంట్ బౌల్ట్ | కివీస్ | రూ.2 కోట్లు | రూ.8 కోట్లు | రాజస్థాన్ రాయల్స్ |
| నితీష్ రాణా | భారత్ | రూ.1కోటి | రూ.8 కోట్లు | కేకేఆర్ |
| దేవదత్ పడిక్కల్ | భారత్ | రూ.2కోట్లు | రూ.7.25 కోట్లు | రాజస్థాన్ రాయల్స్ |
| ప్యాట్ కమిన్స్ | ఆస్ట్రేలియా | రూ.2 కోట్లు | రూ.7.25 కోట్లు | కేకేఆర్ |
| క్వింటన్ డికాక్ | సౌతాఫ్రికా | రూ.2 కోట్లు | రూ.6.75 కోట్లు | లక్నో సూపర్ జెయింట్స్ |
| మహమ్మద్ షమీ | భారత్ | రూ.2 కోట్లు | రూ.6.25 కోట్లు | గుజరాత్ టైటాన్స్ |
| డేవిడ్ వార్నర్ | ఆస్ట్రేలియా | రూ.2కోట్లు | రూ.6.25 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్ |


Click it and Unblock the Notifications
