Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 అత్యధిక పరుగుల జాబితా.. టాప్‌-5లో ముగ్గురు భారతీయులే!!

Full list of highest run-scorers in IPL 2020, KL Rahul in Top

హైదరాబాద్: టీ20 అంటేనే బ్యాట్స్‌మన్‌ గేమ్. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) ఇందుకు అతీతమేమీ కాదు. బౌలర్లు మెరిసిన ఘటనలు చాలా తక్కువే. ఎందుకంటే.. ప్రతి జట్టులో హిట్టర్లు ఉంటారు. ఇక ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లదే హవా. తుది జట్టులో ఉండేది నలుగురే అయినా.. అత్యుత్తమ ఆటగాళ్లు ఆడతారు. ప్రతి ఏడాది వారి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో విదేశీ స్టార్ల కంటే మన యువ ఆటగాళ్లే దుమ్మురేపుతున్నారు. అంబటి రాయుడుతో మొదలైన మోత ఇషాన్‌ కిషన్‌ వరకు సాగుతున్నది.

ధోనీ, కోహ్లీ ఇబ్బంది పడుతున్న చోట

ధోనీ, కోహ్లీ ఇబ్బంది పడుతున్న చోట

సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌లు ముగిశాయి. అన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ 10 మ్యాచ్‌లలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్న చోట.. సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, మయాంక్‌ అగర్వాల్‌, లోకేశ్‌ రాహుల్‌, పృథ్వీ షా, రాహుల్‌ తెవాటియా, శుభ్‌మన్‌ గిల్‌ పరుగుల వరద పారిస్తున్నారు. లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండు సెంచరీలు భారత ఆటగాళ్లే చేయగా.. అత్యధిక పరుగుల జాబితా టాప్‌-5లో ముగ్గురు మనవాళ్లే ఉన్నారు.

రాహుల్@1

రాహుల్@1

మూడు మ్యాచ్‌లు ఆడిన లోకేష్ రాహుల్ 222 పరుగులతో ఐపీఎల్ 2020 అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ అగర్వాల్‌ 221 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడు మ్యాచ్‌ల్లో 173 రన్స్ చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఇక సంజూ శాంసన్‌ రెండు మూడు మ్యాచ్‌లు ఆడి 159 రన్స్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐదవ స్థానంలో ఏబీ డివిలియర్స్ (134) ఉన్నాడు. దేవదత్ పడిక్కల్, రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు.

శాంసన్‌ 16 సిక్సర్లు

శాంసన్‌ 16 సిక్సర్లు

పది మ్యాచ్‌లు (హైదరాబాద్‌ మ్యాచ్‌కు ముందు వరకు) ముగియకముందే బౌండ్రీ మీటర్‌పై 153 సిక్సర్లు నమోదయ్యాయి. సాధారణంగా ఏ సీజన్‌ను తీసుకున్నా.. అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో విదేశీయులదే అగ్రస్థానం. కానీ ఈ సారి అందుకు భిన్నంగా తొలి ఆరు స్థానాల్లో మనవాళ్లే ఉన్నారు. శాంసన్‌ 16 సిక్సర్లతో టీమిండియా బెర్త్‌కు సవాల్‌ విసురుతుంటే.. ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటియా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

యూఏఈ మైదానాలు పెద్దవైనా

యూఏఈ మైదానాలు పెద్దవైనా

భారత్‌తో పోల్చుకుంటే యూఏఈలో మైదానాలు పెద్దవి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్‌గా వెళ్లిన బంతి.. అబుదాబిలో నేరుగా ఫీల్డర్‌ చేతిలోనే పడుతుంది. అయినా మనవాళ్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాడు రాహుల్ తెవాటియా కొట్టిన రెండు సిక్సర్లు గ్రౌండ్‌ బయట పడ్డాయి. మయాంక్‌ అగర్వాల్ ఇప్పటి వరకు మూడు బంతులను మైదానం బయటకు పంపాడు. 80 మీటర్లకు తగ్గని సిక్సర్లతో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.

DC v SRH: నట్టూ నువ్ సూపర్.. డెత్‌ ఓవర్‌ బౌలింగ్‌ అంటే ఇదే కదా: బ్రెట్‌ లీ

Story first published: Wednesday, September 30, 2020, 15:56 [IST]
Other articles published on Sep 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+