బట్టలు ఉతికిన గబ్బర్.. పాత్రలు శుభ్రం చేసిన పుజారా.. డైపర్లు మార్చిన పాండ్యా! మరి కోహ్లీ, రోహిత్?

హైదరాబాద్: ప్రతీ ఏడాది క్రీడల క్యాలెండర్.. ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో ఫుల్ బిజీబిజీగా కనిపించేది. కానీ ఈసారి మాత్రం అలా లేదు. కరోనా మహమ్మారి రూపంలో కోరుకోని అతిథి మనముందుకు వచ్చింది. కంటికి కనిపించని వైరస్ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. ఈ మహమ్మారి దాదాపు అందరి జీవితాల్ని తలకిందులు చేసింది.
కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. అయితే ఎప్పుడూ ఆటతో గడిపే క్రికెటర్లకు కరోనా సమయం మంచి విరామంగా లభించింది. ఎప్పుడూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే.. ఆటగాళ్లు ఈసారి కావాల్సినంత సమయం వారితో గడిపారు. కరోనా సమయాన్ని మన క్రికెటర్లు ఎలా ఆస్వాదించారో ఓసారి చూద్దాం.

టిక్‌టాక్‌లో వార్నర్
లాక్‌డౌన్‌లో అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసింది ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. వార్నర్ కంటే మరెవరు గొప్పగా ఎంజాయ్ చేసి ఉండరు!. ఫ్యామిలీతో కలిసి విలువైన సమయాన్ని ఆస్వాదిస్తూ.. అభిమానులతో ఎప్పటికప్పుడు ఆ విశేషాల్ని పంచుకున్నాడు. ఇక టిక్‌టాక్‌లో ఆరంగేట్రం చేసి ఓ ఊపుఊపాడు. హైదరాబాద్ ఫ్యాన్స్‌కు తగ్గట్లుగా టాలీవుడ్‌లో హిట్ అయిన పాటలను టిక్‌టాక్ చేస్తూ అలరించాడు. అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ, రాములో రాములా.. సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ పాటలకు స్టెప్పులు వేసి ఔరా అనిపించాడు. బాహుబలి సినిమాలోని డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో టిక్‌టాక్ స్టార్ అయ్యాడు.

అనుష్కతో కలిసి
గత దశాబ్దంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత బిజీయెస్ట్ క్రికెటర్. తన అద్భుత ఆటతో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు. అయితే ఎప్పుడూ భారత పర్యటనలతో బిజీగా ఉండే కోహ్లీకి.. కరోనా మహమ్మారి వల్ల మంచి విరామం దక్కింది. తన భార్య అనుష్క శర్మతో కలిసి ఆ సమయాన్ని బాగా ఆస్వాదించాడు. ఇంటి భోజనాన్ని బాగా ఆస్వాదించాడు. అనుష్కతో కలిసి సరదాగా క్రికెట్ ఆడటం, తన మిత్రులతో కలిసి లైవ్ చాట్‌లో కబుర్లు చెప్పాడు. మరోవైపు తన తల్లితండ్రులకు కూడా సమయం కేటాయించాడు.

సమైరాతో అల్లరి
ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లాక్‌డౌన్‌ను బాగానే ఉపయోగించుకున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఎంతో సమయం దొరికింది. అంతేగాక విదేశీ క్రికెటర్లతో హిట్‌మ్యాన్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ముచ్చటించాడు. డేవిడ్ వార్నర్, పీటర్సన్‌తో తన ఆలోచనలు, జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన గారాల పట్టి సమైరాతో, కుటుంబంతో కలిసి కాలక్షేపం చేశాడు. ముఖ్యంగా సమైరాతో కలిసి అల్లరి చేశాడు. ఇంటి పనులు కూడా చేశాడు.

బట్టలు ఉతికిన గబ్బర్
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేశాడు. కుటుంబంతో కలిసి సరదా వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. భార్యతో జరిగే చిలిపి గొడవలను బాలీవుడ్ పాటలతో ఫన్నీగా చిత్రీకరించి వీడియోలు పంచుకున్నాడు. కొడుకుతో కలిసి డాన్స్ కూడా చేశాడు. ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్తకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయని హాస్యాన్ని పండించాడు. బట్టలు కూడా ఉతికాడు. ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పాత్రలు శుభ్రం చేసిన పుజారా:
భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఒకవైపు కుటుంబంతో సరదాగా గడిపి.. మరోవైపు ఇంట్లోని పనులతో బిజీబిజీగా గడిపాడు. కూతురుతో కలిసి ఇండోర్ గేమ్స్ ఆడాడు. భార్యకు బ్యాడ్మింటన్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. వంట చేయడం రాదు కాబట్టి ఇల్లు, పాత్రలు శుభ్రం చేస్తూ తన భార్యకు సాయం చేశాడు.

డైపర్లు మార్చిన హార్దిక్:
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు 2020 ఎంతో స్పెషల్. తన జీవిత భాగస్వామిగా నటాషా స్టాంకోవిచ్‌ను ఎంచుకోవడం, తండ్రి కావడం ఈ ఏడాదే జరిగాయి. జనవరి1న నటాషాకు సముద్ర జలాల్లో తన ప్రేమను హార్దిక్ వ్యక్తపరిచాడు. అనంతరం మేలో తాను తండ్రి కాబోతున్నానని తెలిపాడు. ఇక లాక్‌డౌన్ సమయాన్ని హార్దిక్ ఎంతో ఆస్వాదించాడు. తన ఫిట్‌నెస్ మెరుగుపర్చుకున్నాడు. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. అంతేగాక తన భార్య ప్రసవ సమయంలో తోడుగా ఉన్నాడు. ఆపై తన కుమారుడికి డైపర్లు మారుస్తూ తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.

టిక్‌టాక్‌లో చహల్ సందడి:
లాక్‌డౌన్‌లో మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తన జీవిత భాగస్వామిని అభిమానులకు పరిచయం చేశాడు. యూట్యూబర్ ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అంతేగాక తన తండ్రితో కలిసి స్టెప్పులు వేస్తూ సరదాగా వీడియోలు చేయడం, చెస్ ఆడటం చేశాడు. వార్నర్ లానే టిక్‌టాక్‌లో సందడి చేశాడు. ఒక్కోసారి సహచర ఆటగాళ్ల కోపానికి కూడా గురయ్యాడు. ఇక ఇటీవల యూజీ-ధనశ్రీ అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఉమేశ్ ఔట్.. నటరాజన్‌కు బదులు శార్దుల్!! ఎందుకో తెలుసా?