Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు ఏడ్చాడు.. ఇప్పుడు ఏడిపించాడు! శభాష్‌రా బుడ్డోడా!

వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఐపీఎల్ 2025 ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ 14 ఏళ్ల పిల్లాడి పేరు సెన్సేషన్‌గా మారింది. మెగా వేలం డ్రాఫ్ట్ నుంచి అతను సెంచరీ చేసే వరకు ఈ బిహార్ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయడమే కాకుండా.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

మ్యాచ్‌కు ముందే తనకు అవకాశం వస్తే.. తొలి బంతినే సిక్సర్‌గా తరలిస్తానని సహచర ఆటగాళ్లకు ఛాలెంజ్ చేసి మరి కొట్టాడు ఈ బుడ్డోడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో అరంగేట్రం చేసిన ఈ పిల్లాడు.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసి స్టంప్ ఔట్‌ అయ్యాడు. అతని పసితనమో.. మరో కారణమో తెలియదు కానీ.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. పెవిలియన్ చేరుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో‌నూ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు బాది ఔటయ్యాడు. తన దు:ఖాన్ని మనసులో పెట్టుకున్న సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

From Tears to Triumph Vaibhav Suryavanshi Dominates Bowlers in IPL 2025

వరల్డ్ క్లాస్ బౌలర్లను చితక్కొట్టాడు. ఎంతో అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ‌ను చెడుగుడు ఆడాడు. అతని విధ్వంసాన్ని గుజరాత్ బౌలర్లు తట్టుకోలేపోయారు. 11 సిక్సర్లు, 7 ఫోర్లతో గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్‌కు యావత్ దేశం ఫిదా అయ్యింది. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఈ కుర్రాడికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో ఔటై ఏడ్చిన ఈ 14 ఏళ్ల సిక్సర్ల పిడుగు.. మూడో మ్యాచ్‌లోనే బౌలర్లను తన విధ్వంసకర బ్యాటింగ్ ఏడ్పించాడు.

గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర ప్లేయర్ కరీమ్ జనత్‌కు పీడ కల మిగిల్చాడు. అతను వేసిన ఏకైక ఓవర్‌లో 3 సిక్స్‌లు, 3 బౌండరీలు బాది 30 పరుగులు పిండుకున్నాడు. అతని ధాటికి రాజస్థాన్ రాయల్స్.. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 25 బంతులు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Story first published: Tuesday, April 29, 2025, 10:12 [IST]
Other articles published on Apr 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+