Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: సచిన్, రోహిత్, బుమ్రా.. 19 సీజన్లలో 10 మంది కెప్టెన్లు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో జట్టుకు దూరం కాగా.. సూర్యకుమార్ యాదవ్ తాత్కలిక సారథిగా వ్యవహరించాడు. కానీ గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌‌కు సూర్యకుమార్ యాదవ్ కూడా దూరమయ్యాడు. దాంతో జస్‌ప్రీత్ బుమ్రా.. ముంబై జట్టును నడిపించాడు.

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు బుమ్రా 10వ కెప్టెన్‌గా నిలిచాడు. వరుస ఓటములతో సతమతమైన ప్రతీసారి ముంబై ఇండియన్స్‌ను మళ్లీ విజయాల బాట పట్టించడంలో కెప్టెన్లు కీలక పాత్ర పోషించారు. బుమ్రాకు ముందు ముంబైకి సారథ్యం వహించిన తొమ్మిది మంది సారథుల గురించి తెలుసుకుందాం.

సచిన్ టెండూల్కర్

అరంగేట్ర ఐపీఎల్ 2008 నుంచి 2011 వరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహించాడు. మొత్తం 55 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. 32 విజయాలు అందించాడు. అతని విజయాల 58.18%. సచిన్ సారథ్యంలో ముంబై టైటిల్ గెలవకపోయినా.. ఐపీఎల్ 2010‌లో ఫైనల్ చేరింది.

సచిన్ కెప్టెన్సీ కాలంలో షాన్ పొలాక్ నాలుగు మ్యాచ్‌లకు (75.00% విజయం), డ్వేన్ బ్రావో ఒక మ్యాచ్‌కు (0.00% విజయం) తాత్కాలిక కెప్టెన్‌లుగా వ్యవహరించారు.

From Sachin Tendulkar to Jasprit Bumrah Full List of 10 Captains Who Led Mumbai Indians in IPL History

హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 2008 2012 మధ్య 30 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించి 14 విజయాలు అందించాడు (46.66% విజయం).

రికీ పాంటింగ్..

2013లో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఆరు మ్యాచ్‌లకు ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. అతని విజయాల శాతం 50. అతని తర్వాతే ముంబై ఇండియన్స్ భవిష్యత్తు పూర్తిగా మారింది.

రోహిత్ శర్మ..

ఐపీఎల్ 2013 సీజన్ మధ్యలోనే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను స్వీకరించిన రోహిత్ శర్మ.. ఆ జట్టు తలరాతనే మార్చేసాడు. ఐపీఎల్ 2013 నుంచి 2023 వరకు 163 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన రోహిత్ 91 మ్యాచ్‌లు గెలిపించాడు. అతని విజయాల శాతం 55.82.

అంతేకాకుండా 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాలలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిపించి ముంబై ఇండియన్స్‌కు ఓ స్వర్ణయుగాన్ని తెచ్చాడు. రోహిత్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కీరన్ పొలార్డ్ తొమ్మిది మ్యాచ్‌లకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని విజయాల శాతం 55.55.

హార్దిక్ పాండ్యా..

ఐపీఎల్ 2024 సీజన్‌లో రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై సారథ్య బాధ్యతలు అప్పగించింది. కానీ ఈ నిర్ణయం ముంబై ఫ్రాంచైజీకి తీవ్ర నష్టం చేసింది. హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 37 మ్యాచ్‌ల్లో ముంబైకి 15 విజయాలు మాత్రమే అందించాడు. అతని విజయాల శాతం 40.54 శాతమే. హార్దిక్ పాండ్యాకు డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ నాలుగు మ్యాచ్‌ల్లో జట్టును నడిపించి రెండు విజయాలు అందించాడు. తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా తాత్కలిక సారథిగా వ్యవహరించి తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందించాడు.

Story first published: Friday, May 15, 2026, 12:08 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+