Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ చరిత్రలోనే భయమెరుగని సారథులు.. కోహ్లీకి దక్కని చోటు!

ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత 18 ఏళ్లుగా భారత అభిమానులనే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఈ క్యాచ్ రిష్ లీగ్ అలరిస్తోంది. ఈ ధనాధన్ లీగ్‌‌ను ఒక్కసారైనా ఆడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు కలలు కంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్‌గా నిలిచిన ఐపీఎల్‌.. అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది.

ఈ 18 ఏళ్ల కాలంలో ఎంతో మంది సారథులు తమ నిర్ణయాలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేశారు. సంచలన నిర్ణయాలతో తమ జట్లను విజేతగా నిలబెట్టారు. భయమెరుగని కెప్టెన్లుగా నిలిచిపోయారు. దూకుడైన నిర్ణయాలతో ఫియర్‌లెస్ ఐపీఎల్ కెప్టెన్లుగా గుర్తింపు పొందిన సారథులపై ఓ లుక్కెద్దాం.

From MS Dhoni to Pat Cummins Most Fearless Captains in IPL History No Chance For Virat Kohli

1.షేన్ వార్న్
ఐపీఎల్ 2008 అరంగేట్ర సీజన్‌లో తన దూకుడైన నిర్ణయాలతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ఆకట్టుకున్నాడు. కుర్రాళ్లతో పాటు అనామక ప్లేయర్లతో జట్టును నిర్భయంగా నడిపించి విజేతగా నిలబెట్టాడు. రవీంద్ర జడేజా, యూసఫ్ పఠాన్‌లతో కలిసి కెప్టెన్‌గా దూకుడైన నిర్ణయాలు తీసుకున్న షేన్ వార్న్.. ఐపీఎల్‌కు ఫియర్‌లెస్ కెప్టెన్సీని పరిచయం చేశాడు. ఆ తర్వాత మిగతా జట్ల సారథులు షేన్ వార్న్‌ను అనుసరించారు.

2. మహేంద్ర సింగ్ ధోనీ..
రెండు ప్రపంచకప్‌లు గెలిచిన ధోనీ.. ఐపీఎల్‌లోనే సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉంటూ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం ధోనీ కెప్టెన్సీ స్టైల్. అసాధారణమైన అతని వ్యూహాలు ధోనీని గొప్ప కెప్టెన్‌గా నిలబెట్టాయి. వికెట్ల వెనుకాల కీపింగ్ చేస్తూ.. క్రీజులో బ్యాటర్ల కదలికలకు తగ్గట్లు ఫీల్డ్ సెటప్ చేయడంతో పాటు బౌలర్లకు సూచనలు చేయడం ధోనీ స్పెషలిటీ. ధోనీ సారథ్యంలో ఆడే బౌలర్లు ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన చేస్తారు. డాడీస్ ఆర్మీ కెప్టెన్‌గా కూడా ధోనీకి పేరుంది. ఇప్పటి వరకు ధోనీ సారథ్యంలో సీఎస్‌కే ఐదు టైటిళ్లు గెలిచింది.

3. గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్‌కు కూడా దూకుడైన కెప్టెన్‌ అనే పేరు ఉంది. ఐపీఎల్‌లో కేకేఆర్‌ను అతను ఛాంపియన్ జట్టుగా మార్చాడు. మైదానంలో రిస్క్ తీసుకొని ఫలితాలను రాబట్టాడు. అతని సారథ్యంలో కేకేఆర్ రెండు టైటిళ్లు గెలిచింది.

4.రోహిత్ శర్మ..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన తెలివైన నిర్ణయాలతో సక్సెస్ సాధించాడు. మైదానంలో రిస్కీ నిర్ణయాలు తీసుకొని ఫలితాలను రాబట్టాడు. ఆటగాళ్లకు అండగా ఉండే రోహిత్.. కీలక ఫైనల్లోనూ సంచలన నిర్ణయాలతో ముంబైని విజేతగా నిలబెట్టాడు. అతని సారథ్యంలో ముంబై ఏకంగా ఐదు టైటిళ్లు గెలిచింది.

5.ప్యాట్ కమిన్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.. లేట్‌గా సారథ్య బాధ్యతలు చేపట్టినా..తన మార్క్ చూపించాడు. తనదైన కెప్టెన్సీతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చాడు. తన దూకుడైన నిర్ణయాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కుర్రాళ్లకు స్వేచ్చనిచ్చాడు. దాంతో సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Story first published: Thursday, March 20, 2025, 15:19 [IST]
Other articles published on Mar 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+