సింగిల్ డిజిట్ తేడాతో ముగిసిపోయిన టెస్టు మ్యాచ్‌లివే


హైదరాబాద్: పాక్‌దే విజయం అనుకుంటున్న తరుణంలో మ్యాచ్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకుని న్యూజిలాండ్ కేవలం 4 పరుగుల తేడాతో విజయాన్ని ఎగరేసుకుపోయింది. కొద్ది రోజుల ముందు ముగిసిన టెస్టు సిరీస్ తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. 176 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్.. ఓ దశలో 147/4తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అనూహ్య ఆటతీరుకు మారుపేరైన ఆ జట్టు 171 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది.
5 రోజుల పాటు జరిగే టెస్టుల్లోనూ సందర్భాన్ని బట్టి ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటాయి. తొలి ఇన్నింగ్స్‌ల్లో భారీ స్కోర్లు చేసిన బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడి జట్టు ఓటమికి కారణమైన సందర్భాలున్నాయి. భారీ తేడాలతో విజయాలు నమోదైనట్లే.. కేవలం సింగిల్ డిజిట్ ఆధిక్యంతో విజయం సాధించిన సందర్భాలు లేకపోలేదు. ఇలా గెలిచిన మ్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయాయి.

నాలుగు పరుగుల తేడాతో
పాక్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ నాటకీయ శైలిలో జరిగిన ముగింపు టెస్టు క్రికెట్‌కు చక్కని ప్రచారమని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ‘ఏదేమైనా గెలవాల్సిందే'అనే తన జట్టు వైఖరిని ప్రశంసించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో కివీస్ కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం 4పరుగుల గెలుపు అంతరంతో న్యూజిలాండ్ గెలిచింది. టెస్టు క్రికెట్లో ఇది ఐదో అతి తక్కువ గెలుపు అంతరం.

మూడు పరుగుల తేడాతో
తప్పుడు కారణాలతో మ్యాచ్ విజయం తారుమారైంది. ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా మూడు పరుగులతేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ విజయానికి 124 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో ఉన్న జో డార్లింగ్... విల్ ఫ్రెడ్‌ల భాగస్వామ్యంలో ఇన్నింగ్స్ క్రమంగా దూకుడు పెంచింది. ఆసమయంలో డార్లింగ్ అవుటవడంతో ఫ్రెడ్ తాతె బ్యాటింగ్‌కు వచ్చాడు. మ్యాచ్ ముగింపు సమయానికి ఇంకా 8పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.
తాతె ఫోర్ యత్నించగా జాక్ శాండర్స్ బంతి అందుకుని స్టంప్ అవుట్ చేశాడు. యాషెస్ సిరీస్ గెలిచేందుకు ఆస్ట్రేలియాకు ఆ ఒక్క ప్రయత్నం చాలు. ఈ మ్యాచ్ తర్వాత తాతె మరెప్పుడూ ఇంగ్లాండ్‌కు ఆడలేదు.
ఇది నా కెరీర్‌లోనే అత్యుత్తమ విజయం: కేన్ విలియమ్సన్

మూడు పరుగుల తేడాతో..
1982లో మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుకు 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే పర్యాటక జట్టు బౌలర్ల ధాటికి ఆసీస్ 281/9తో ఓటమి ముంగిట నిలిచింది. దీంతో అలెన్ బోర్డర్.. జెఫ్ ధామ్సన్‌తో కలిసి ఓటమిని తప్పించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బోథమ్ కొత్త బంతిని తీసుకోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు.
థామ్సన్ బ్యాట్ అంచుకు తగిలిన బంతిని స్లిప్‌లో జిఫ్ మిల్లర్ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ఆతిథ్య జట్టు 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియానే బాధిత జట్టు కావడం కాకతాళీయం.

రెండు పరుగుల తేడాతో..
2005లో యాషెష్ సిరీస్ సందర్భంగా బర్మింగ్‌హామ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఓ దశలో 137/7తో భారీ ఓటమి ముంగిట నిలిచింది. పదో వికెట్‌కు బ్రెట్‌లీ, మైఖేల్ కాస్పరోవ్ 59 పరుగులు జోడించి విజయంపై ఆశలు చిగురింపజేశారు. ఇంగ్లాండ్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ వేసిన బౌన్సర్‌ను ఆడేందుకు కాస్పరోవ్ ముందుకు వచ్చాడు.
అది కాస్తా మిస్ అయి బంతిని అందుకున్న వికెట్ కీపర్ గ్రెయింట్ జోన్స్ వెంటనే వికెట్లను గిరాటేయడంతో ఆస్ట్రేలియా రెండు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1986-87 తర్వాత తొలిసారి యాషెస్ సిరీస్ గెలుచుకుంది.

ఒక్క పరుగు తేడాతో..
1993లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. అప్పటికే నాలుగు మ్యాచ్‌లు జరగగా ఆసీస్ 1-0తేడాతో ముందంజలో ఉంది. అడిలైడ్ వేదికంగా జరిగిన ఐదో మ్యాచ్‌లో విండీస్.. ఆస్ట్రేలియాకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యమే అనుకుని బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఆ జట్టుకు 144 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.
చివరి వికెట్‌కు టిమ్ మే, క్రెగ్ మెక్ డెర్మోట్ నిలబడి జట్టును గట్టెక్కించేందుకు పోరాడినా.. ఒక పరుగు ముంగిట విజయం నిలిచిపోయింది. దీంతో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో ఆసీస్‌పై విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications