For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Usman Tariq: పగోడైనా.. ఈ ధోనీ ఫ్యాన్‌ కష్టాన్ని అభినందించాల్సిందే!

'ఉస్మాన్ తారిక్' ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచం కలవరిస్తున్న పేరు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియా వేదికగా అతని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా అతని బౌలింగ్ శైలిపై తీవ్ర దుమారం రేగింది. చేతిని వంచే పద్దతి కొంచెం వివాదాస్పదంగా ఉండటంతో సామాన్య అభిమానుల నుంచి క్రికెట్ విశ్లేషకుల వరకు తారిక్ గురించే మాట్లాడారు.

అతనిది త్రో బౌలింగ్ అని, ఐసీసీ ఎలా అనుమతించిందని భారత అభిమానులు విమర్శలు గుప్పించారు. కానీ ఇవేవి పట్టించుకోని ఉస్మాన్ తారిక్.. భారత్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్(4/16) నాలుగు వికెట్లతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

శత్రు దేశానికి చెందిన వాడు కావడంతో భారత అభిమానులు తారిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అతను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా చూసి తాను క్రికెటర్‌ను అయ్యానని ఉస్మాన్ తారిక్ స్వయంగా వెల్లడించాడు. అయితే ధోనీలా అతని జీవిత కథ కూడా స్ఫూర్తిదాయకమైనదే.

From Dubai Salesman to T20 World Cup Hero How an MS Dhoni Film Inspired Pakistan s Mystery Spinner Usman Tariq

4 ఏళ్లకే తండ్రి మరణం..

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో ఉస్మాన్ తారిఖ్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి క్రికెట్ అంటే ఇష్టం. అయితే అతని నాలుగేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లు క్రికెట్ ఆడినా.. ఒక వయసు వచ్చాక కుటుంబ బాధ్యత మొత్తం తారిక్ మీద పడింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దాంతో క్రికెట్ వదిలేసిన తారిక్ దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ మ్యాన్‌గా పని చేశాడు. ఇలా పని చేసుకుంటున్న సందర్భంలోనే అనుకోకుండా 'ఎంఎస్ ధోనీ' సినిమాను చూశాడు.

ఒక వైపు జాబ్ చేసుకుంటూనే క్రికెట్ కోసం ధోనీ ఎంత పరితపించిపోయాడో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన జీవితం కూడా అంతే కదా అనుకున్నాడు. ఉద్యోగం కోసం క్రికెట్‌ను వదిలేసి.. ధోనీలాగ తానేందుకు చేయలేనని అనుకున్నాడు. ధోనీ కూడా ఒక మామూలు మనిషే కదా.. ఆయన సాధించగా లేనిది తానెందుకు సాధించలేనని భావించాడు. వెంటనే ఉద్యోగాన్ని వదిలేసి పాకిస్థాన్‌కు తిరిగి పయనమయ్యాడు. మళ్లీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు.

ఫకర్ జామన్ పరిచయంతో..

ఈ క్రమంలో ఒక స్నేహితుడి ద్వారా పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ పరిచయమయ్యాడు. అతను తారిక్‌ను ఒక కోచ్‌కు పరిచయం చేశాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వజహతుల్లా వస్తీ దగ్గర కూడా ఉస్మాన్ తారిక్ శిక్షణ తీసుకున్నాడు. అలా క్రికెటర్‌గా రాటు దేలిన తారిక్‌కు పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడే అవకాశం దక్కింది. ఇక్కడి నుంచి తారిక్ వెనక్కి చూసుకోలేదు.

పీఎస్‌ఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, ఐఎల్‌టీ20లో డెజర్ట్ వైపర్స్ తరపున ఆడే అవకాశం దక్కింది. ఫ్రాంచైజీ లీగ్స్‌లో సత్తా చాటడంతో పాకిస్థాన్ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. గతేడాది చివర్లో అతను పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మెరుగైన ప్రదర్శన చేయడంతో జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.

ఎన్నో ఫిర్యాదులు..

అయితే అతని వినూత్న బౌలింగ్ యాక్షన్ కారణంగా తరుచూ ఫిర్యాదులు వచ్చాయి. దాంతో పీసీబీ.. ఐసీసీ నిపుణుల సహాయంతో బయోమెకానిక్స్ పరీక్ష నిర్వహించింది. తారిఖ్‌కు పుట్టకతోనే డబుల్ జాయింటెడ్ ఆర్మ్స్‌ ఉండటంతో.. సహజంగానే చేతులు వంగి ఉన్నాయనే విషయం తేలింది. అతను కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. కావాలని వంచడం లేదని చెప్పాడు. ఐసీసీ పరీక్షలో పాసవ్వడంతో అతనికి తిరుగే లేకుండా పోయింది.

తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వచ్చినప్పుడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అతనికి అండగా నిలిచాడు. భయపడాల్సిన అవసరం లేదని, బౌలింగ్ యాక్షన్ బాగుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. అలా పరోక్షంగా ధోనీ, ప్రత్యక్షంగా వాట్సన్ ఇచ్చిన ధైర్యం, స్పూర్తితో తారిఖ్ ఇవ్వాళ సెన్సేషనల్ బౌలర్‌గా ఎదిగాడు. తారిక్ ఆడిన గత 25 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ తీయని మ్యాచ్‌ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన తారిక్ 16 వికెట్లు పడగొట్టాడు. తారిక్ పగోడైనా.. టాలెంటెడ్ స్పిన్నర్. అతని ఆటను ఎవరైనా అభినందించాల్సిందే.

Story first published: Thursday, February 19, 2026, 15:26 [IST]
Other articles published on Feb 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+