Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కలల ఇంటిని నిర్మించే పని: కూలీ అవతారంలో డేవిడ్ వార్నర్

From ball-tamperer to wall-tamperer: David Warners new innings

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కేప్ టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించగా... బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించిన కామెరూన్ బాన్‌క్రాప్ట్‌పై 9 నెలలు పాటు నిషేధం విధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధంతో ఏడాది పాటు ఆటకు దూరమైన డేవిడ్ వార్నర్ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

అంతేకాదు డేవిడ్ వార్నర్ తన కలల ఇంటిని నిర్మించే పనిలో బిజీగా ఉన్నాడు. సిడ్నీ శివారులో బీచ్‌కు సమీపంలో తన కుటుంబం కోసం ఓ సరికొత్త భవనాన్ని డేవిడ్ వార్నర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం తన భార్య, ఇద్దరు పిల్లలతో ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటున్నాడు.

ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ తన తలకు హార్డ్‌హ్యాట్‌ను ధరించి చేతిలో నిర్మాణ సామాగ్రిని పట్టుకొని ఉన్న ఫొటోను వార్నర్ భార్య కాండిస్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. డేవిడ్ వార్నర్ పెట్టుకున్న హ్యాట్‌పై.. డి వార్నర్, ప్రాజెక్ట్ మేనేజర్, అప్రెంటీస్ సెలబ్రిటీ అని రాసి ఉంది.

మరోవైపు డేవిడ్ వార్నర్ కుమార్తెలు కూడా టోపీలను పెట్టుకొని కొత్తగా నిర్మిస్తున్న ఇంటి బయట తిరుగుతోన్న ఫోటోలను కాండిస్ వార్నర్ ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ 'ప్రియమైన పిల్లలు నిర్మాణంలో ఉన్న తమ బెడ్‌రూమ్‌ల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు' అని ట్వీట్ చేసింది. నిషేధం కారణంగా వార్నర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, April 20, 2018, 18:02 [IST]
Other articles published on Apr 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+