Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంజలి.. ఆడపులి! ఆదోని నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ జట్టు వరకు..!

From Adoni to India Women’s T20 World Cup 2023 team: the story of Anjali Sarvani

హైదరాబాద్: యువ క్రికెటర్, తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైంది. సౌతాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10-26 మధ్య జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టును ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 25 ఏళ్ల అంజలికి చోటు దక్కింది. పేస్ బౌలర్ అయిన అంజలి ఇటీవల ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఆకట్టుకోవడంతో ప్రపంచకప్‌ జట్టులో అవకాశం దక్కించుకుంది.

కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అంజలి అతి తక్కువ కాలంలోనే భారత మహిళల క్రికెట్ సర్కిల్‌లో పేరు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచే ఆటల్లో చురుకైన అంజలి తొలుత అథ్లెటిక్స్‌పై ఇంట్రస్ట్ చూపెట్టింది. 100 మీటర్ల స్ప్రింటర్‌గా గ్రౌండ్‌లో పరుగులు పెట్టింది. అదే టైమ్‌లో దోస్తులతో గల్లీ క్రికెట్ ఆడింది. అయితే సరదాగా ఓ క్రికెట్ క్యాంప్‌లో పాల్గొనడంతో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. చిన్ననాటి కోచ్ వెంకటేశ్ సూచనతో అథ్లెటిక్స్ ట్రాక్ నుంచి క్రికెట్‌ పిచ్‌పైకి వచ్చింది.

స్ప్రింటర్ కావడంతో సహజంగానే ఫాస్ట్ బౌలింగ్‌పై ఇష్టం పెంచుకుంది. రోజూ ఎనిమిది గంటల పాటు కష్టపడింది. యువరాజ్ సింగ్‌ను ఆరాధించే తాను బ్యాట్‌తోనూ రాణించగలదు. గవర్నమెంట్ టీచర్ అయిన తండ్రి రమణారావు అమెను ప్రోత్సహించారు. క్రికెట్‌పై ఫోకస్ పెట్టేందుకు హైదరాబాద్ పంపించారు. ఆంధ్ర క్రికెట్ టీమ్‌తో పాటు యూనివర్సిటీ లెవెల్లో సత్తా చాటిన అంజలికి రైల్వేస్ టీమ్‌ నుంచి పిలుపు వచ్చింది. రైల్వేస్‌లో సీనియర్ల సహచర్యంతో పాటు కోచ్ నూషిన్ అలీ గైడెన్స్‌లో తన ఫిట్‌నెస్ మరింత మెరుగుపరుచుకుంది.

2022-23 సీజన్‌లో 9.40 యావరేజ్‌తో 30 వికెట్లు పడగొట్టి జట్టుకు రెండు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె టాలెంట్‌ను గుర్తించిన సెలెక్టర్లు ఈ నెలలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఐదు మ్యాచ్‌ల్లో తెలుగు అమ్మాయి మెప్పించింది. దాంతో వరల్డ్ కప్ జట్టుకు సెలెక్ట్ అయ్యింది.

Story first published: Thursday, December 29, 2022, 12:15 [IST]
Other articles published on Dec 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+