Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఒక్క రియాక్షన్‌తో.. నేషనల్ క్రష్‌గా మారిన బ్యూటీ!

ఐపీఎల్‌తో అనామక ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారడం.. స్టార్ ఆటగాళ్లుగా ఎదగడం చూస్తుంటాం. కానీ దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ కారణంగా మ్యాచ్‌లకు హాజరయ్యే అందమైన అమ్మాయిలు కూడా నేషనల్ క్రష్‌గా మారుతున్నారు. రాత్రికి రాత్రే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు. గతంలో మ్యాచ్‌కు హాజరై క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన అమ్మాయిలు.. సోషల్ మీడియా వేదికగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆర్యప్రియ భూయాన్ అనే 19 ఏళ్ల అమ్మాయి.. నేషనల్ క్రష్‌గా మారింది.

ధోనీ డైహార్డ్ ఫ్యాన్ అయిన ఈ అమ్మాయి ఇచ్చిన ఒక్క ఎక్స్‌ప్రెషన్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచింది. గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య గత ఆదివారం(మార్చి 30) జరిగిన మ్యాచ్‌కు ఆర్య ప్రియ హాజరైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైంది. అయితే ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. క్రీజులో ధోనీ ఉండటంతో అభిమానులంతా ఆసక్తిగా చూశారు. కానీ సందీప్ శర్మ బౌలింగ్‌లో అతను భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు.

From 800 To 369K Followers CSK Fan Girl Aaryapriya Bhuyan s Viral Reaction To Dhoni s Dismissal
Photo Credit: aaryapriyaa Instagram

ధోనీ ఔటవ్వడంపై ఆర్యప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. పళ్లు కొరుకుతూ.. తన పిడికిలిని బిగిస్తూ ధోనీపై అసహనం వ్యక్తం చేసింది. ఆ అమ్మాయి క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌ టీవీ కెమెరాల్లో కనిపించడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి తెలుసుకునేందుకు తెగ ప్రయత్నించిన నెటిజన్లు.. చివరకు ఆమె సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి ఆ వివరాలను పంచుకున్నారు. దాంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆర్యప్రియ భూయాన్ ఫాలోవర్ల సంఖ్య 800 ఉండగా..ఈ మ్యాచ్ అనంతరం ఈ సంఖ్య 3 లక్షల 69 వేలకు చేరింది. అంతేకాకుండా ఈ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్ గురించి ప్రతీ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దాంతో ఆమెకు ఊహించని పాపులారిటీ దక్కింది. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌లో 12 పోస్ట్‌లు మాత్రమే పెట్టడం గమనార్హం.

ఎంతలా అంటే.. ప్రముఖ గ్రోసరి డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. తమకు ప్రచారకర్తగా వ్యవహరించాలని కోరేంత పాపులారిటీ దక్కింది. ఈ విషయాన్ని ఆర్యప్రియనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'కోలాబ్ టునైట్.. కోలాబ్ టునైట్ క్వీన్? 'అని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆర్య ప్రియను సంప్రందించింది. ధోనీ ఔటైనప్పుడు తాను నిరాశకు గురయ్యానని, కానీ అదే తనకు సంతోషకరమైన క్షణంగా మారిపోయిందని ఆర్యప్రియా రెండు వీడియోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'ధోనీ ఔటై.. ఓ అమ్మాయి కెరీర్ నిలబెట్టాడు.'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, April 6, 2025, 18:51 [IST]
Other articles published on Apr 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+