For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup కోసం కసరత్తు.. కన్నెర్ర చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు!

Franchises unhappy over BCCI to Conduct Pre-IPL Fitness Assessment Camp at NCA

బెంగళూరు: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఆ క్రమంలోనే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ ఆటగాళ్లతో నేషనల్ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అయితే ఈ క్యాంప్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందు ఇలా బీసీసీఐ క్యాంప్‌ల పేరిట ఆటగాళ్లను దూరం చేయడం ద్వారా తమకు అనేక సమస్యలు వస్తాయని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్‌కు ఫిర్యాదు చేశాయి.

స్పాన్సర్స్‌తో ఒప్పందాలు..

స్పాన్సర్స్‌తో ఒప్పందాలు..

సీజన్‌కు ముందు స్పాన్సర్‌తో తమకు కమిట్‌మెంట్స్ ఉంటాయని, కానీ, వ్యాపార ప్రకటనల వంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కీలక ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని తెలిపాయి. ప్లేయర్లంతా ఒక్క చోట ఉండటంతో వాళ్లు కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న క్యాంప్ ముగిస్తే.. తర్వాతి రోజు సదరు ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీల బేస్‌కు చేరుకుంటారు. ఐపీఎల్ బయో బబుల్‌లో చేరే ముందు మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. ఈ లెక్కన భారత టాప్ ప్లేయర్లంతా మార్చి 19 లేదా 20నే ఫ్రాంచైజీలకు అందుబాటులోకి వస్తారు.

టీమ్స్ ప్రణాళికలపై ప్రభావం..

టీమ్స్ ప్రణాళికలపై ప్రభావం..

ఆపై ఆరు రోజుల్లోనే మెగా లీగ్ మొదలవుతుంది కాబట్టి.. స్పాన్సర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తి చేయడానికి సమయం సరిపోదని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. ఈ నెల 26న లీగ్‌ ఆరంభమవుతున్న నేపథ్యంలో.. 12వ తేదీ నాటికి ఆటగాళ్లందరినీ ఒక్కచోటుకు చేర్చి వాళ్ల మధ్య బంధం ఏర్పడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఫ్రాంఛైజీలు ప్రణాళికలు రచించాయి. కానీ బీసీసీఐ క్యాంప్‌తో స్టార్ ఆటగాళ్లంతా అందుబాటులో లేకుండా పోయారు. అయితే ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్‌ జట్లతో చేరేలా శిబిరంలో చివరి అయిదు రోజులు బయో బబుల్‌ ఏర్పాటు చేస్తారని తెలిసింది.

హార్దిక్‌కు పిలుపు..

హార్దిక్‌కు పిలుపు..

ఫిట్‌నెస్ క్యాంప్‌లో పాల్గొనాలని స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ కాస్త సమయం కావాలని కోరిన హార్దిక్‌ మరో రెండు రోజుల్లోపు ఎన్‌సీఏ వెళ్లే అవకాశం ఉంది. కోచ్‌ ద్రవిడ్‌, సెలక్టర్లు ఈ శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 25 మందికి పైగా ఆటగాళ్లు అందులో పాల్గొంటున్నారు. ''టీ20 ప్రపంచకప్‌కు మరో ఆరు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రణాళిక ప్రారంభమైంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కోచ్‌, సెలక్టర్లు పరీక్షించాలని అనుకుంటున్నారు'' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సౌతాఫ్రికాతో రీఎంట్రీ..

సౌతాఫ్రికాతో రీఎంట్రీ..

గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి గాయాలు, ఫామ్‌లేమితో టీమిండియాకు దూరంగా ఉన్నప్పటికీ తిరిగి జట్టులో స్థానం కోసం హార్దిక్‌ను పరిగణిస్తున్నారనే విషయం ఇప్పుడు స్పష్టమైంది. జూన్‌లో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతన్ని ఆడించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ ఘోర వైఫల్యం అనంతం హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించనున్న హార్దిక్.. అక్కడ సత్తా చాటి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనే లక్ష్యంతో సన్నదం అవుతున్నాడు.

Story first published: Tuesday, March 8, 2022, 8:24 [IST]
Other articles published on Mar 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+