మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన నక్క..!(వీడియో)
కుక్కలు, పాములు, పక్షులు, పురుగులు, వర్షాలు క్రికెట్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగించడం చూశాం. కానీ తాజాగా ఓ నక్క ఆటకు అంతరాయం కలిగించింది. అనూహ్యంగా మైదానంలోకి దూసుకొచ్చిన నక్క.. గ్రౌండ్ మొత్తం పరుగెత్తుతూ హడావిడి చేసింది. దాంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే ఆ నక్క ఎవరికీ అంతరాయం కలిగించకుండా బయటకు వెళ్లే మార్గాన్ని కనుగొని వెళ్లిపోయింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాసేపు మైదానంలో నక్క చేసిన హంగామాను తలుచుకొని నవ్వుకున్నారు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌లోని ది ఓవల్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సర్రే, హాంప్‌షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ సాగుతుండగా.. ఎక్కడి నుంచో ఓ నక్క మైదానంలోకి దూసుకొచ్చింది.

దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. హ్యాంప్‌షైర్ బ్యాటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నక్క ఎంట్రీతో అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. దాంతో మైదానం మొత్తం తిరిగిన నక్క బౌండరీ లైన్ గోడ దూకి బయటకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications