1921 తర్వాత ఇదే తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో నలుగురు ఓపెనర్లు!!

మాంచెస్టర్: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్.. అనుకున్న పని చేసింది. మాంచెస్టర్‌లో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్.. 198 పరుగులకే ఆలౌట్ చేసింది. షమర్ బ్రూక్స్ (136 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), జర్మయిన్ బ్లాక్‌వుడ్ (88 బంతుల్లో 7 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీలు చేశారు. స్టువర్ట్ బ్రాడ్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్, డోమ్ బెస్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఒకే మ్యాచ్‌లో నలుగురు ఓపెనర్లు:
మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. టెస్టులో ఇంగ్లండ్‌కి నలుగురు బ్యాట్స్‌మెన్‌లు ఓపెనర్లుగా ఆడారు. సొంతగడ్డపై ఇంగ్లండ్ ఏకంగా నలుగురు ఓపెనర్లు మార్చడం 1921 తర్వాత ఇదే తొలిసారి. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లుగా రోరీ బర్న్స్ (15), డొమినిక్ సిబ్లే (120) ఆడారు. ఈ జోడీ ఆశించిన మేర రాణించలేకపోయింది. బర్న్స్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకోగా.. సిబ్లే మరీ నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ ఇద్దరినీ పక్కన పెట్టిన ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్.. బెన్ స్టోక్స్ (78 నాటౌట్, జోస్ బట్లర్ (0)లను ఓపెనర్లుగా పంపింది. బట్లర్ ఫెయిలవగా.. స్టోక్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

99 ఏళ్ల తర్వాత:
1921లో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలిసారి ఇంగ్లండ్ సొంతగడ్డపై నలుగురు ఓపెనర్లని ఒకే మ్యాచ్‌లో ఆడించింది. ఆ తర్వాత కూడా దాదాపు 8 సార్లు ఇంగ్లండ్ నలుగురు ఓపెనర్లని ఒకే మ్యాచ్‌లో ఆడించింది. కానీ అవన్నీ విదేశీ గడ్డపైనే. 1954లో వెస్టిండీస్‌పై టెస్టులో చివరగా నలుగురు ఓపెనర్లతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 99 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ప్రయోగం చేసింది. మొత్తానికి ఇంగ్లండ్ జట్టు నలుగురు ఓపెనర్ల ప్రయోగం బాగానే వర్కవుట్ అయింది.

113 పరుగుల తేడాతో విజయం:
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ .. బెన్ స్టోక్స్ (176: 356 బంతుల్లో 17x4, 2x6), డొమినిక్ సిబ్లే (120: 372 బంతుల్లో 5x4) శతకాలు బాదడంతో మొదటి ఇన్నింగ్స్‌ని 469/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 287 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్‌కి 182 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ (78 నాటౌట్: 57 బంతుల్లో 4x4) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌ని 129/3తో డిక్లేర్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 182 పరుగులు కలుపుకుని మొత్తం 312 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో తడబడిన విండీస్ 198 పరుగులకే ఆలౌటైంది.
ఈ విషయం తెలుసా?.. టెస్టు, వన్డేలో ఒక్కో వికెట్ తీసిన గవాస్కర్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications