
బ్రిడ్జ్ టౌన్: వెస్టిండీస్ మాజీ పేసర్ ఎజ్రా మోస్లీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సైకిల్‌పై వెళ్తున్న ఈ 63 ఏళ్ల మాజీ బౌలర్‌ను గుర్తు తెలియని ఓ ఎస్యూవీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన బ్రిడ్జ్‌టౌన్ రోడ్ జంక్షన్ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుందిని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.
వెస్టిండీస్ తరఫున రెండు టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడిన మోస్లీ.. 2016 టీ20 ప్రపంచకప్ గెలుపొందిన మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారు. టెస్ట్‌ల్లో 6, వన్డేల్లో ఏడు వికెట్లు తీశాడు. ఎజ్రా మోస్లీ మృతి పట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
"ఘోర రోడ్డు ప్రమాదంలో ఎజ్రా మోస్లీ మరణించాడనే వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. విండీస్ క్రికెట్ బోర్డు విషాదంలో మునిగిపోయింది" అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. జూనియర్ స్థాయి క్రికెట్ జట్లకు కూడా మోస్లీ కోచ్‌గా సేవలందించారు. ఆయన మరణంపై వెస్టిండీస్ మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నివాళులర్పిస్తున్నారు.