Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య!

శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషన(41) దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, పిల్లల ఎదుటే ఓ దుండగుడు అతన్ని దారుణంగా కాల్పి చంపాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

శ్రీలంకలోని గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో ధామిక కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అతడి ఇంట్లోకి చొరబడి ధామిక నిరోషనపై దాడి చేశాడు. అతడి కుటుంబ సభ్యుల ముందే తుపాకీతో కాల్పలు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధామిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Former Sri Lanka Cricketer Tragically Shot Dead In Front Of Family

సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు మీడియాకు వెల్లడించారు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన ధామిక 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్ 19 జట్టు‌కు సారథిగా వ్యవహరించాడు. రెండేళ్ల పాటు వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

ఆ తర్వాత కొంతకాలం ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన ధామిక.. వ్యక్తిగత కారణాలతో 20 ఏళ్ల వయసులోనే క్రికెట్‌ను వదిలేశాడు. అతని అకాల మరణం పట్ల శ్రీలంక క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Story first published: Wednesday, July 17, 2024, 14:08 [IST]
Other articles published on Jul 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+