సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టబడ్డాడు. ఆదివారం రాత్రి సిడ్నీలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. సిడ్నీలోని మారూబ్రాలో నిర్వహించిన రాండమ్ బ్రీత్ అనలైజర్ పరీక్షలో.. డేవిడ్ వార్నర్ మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.
న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ పాయింట్ వద్దకు రాకముందే 39 ఏళ్ల వార్నర్ తన కారును ఆపి పక్కకు పార్క్ చేశాడంట. అయితే.. అధికారులు అతన్ని సమీపించి బ్రీత్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి మారూబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్కడ నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో 0.104 రీడింగ్ నమోదైంది. ఈ కేసు విషయమై వచ్చే నెలలో కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. లీగ్ మధ్యలో చిన్న విరామం కోసం స్వదేశానికి వెళ్లారు. కరాచీ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి జోరు మీద ఉంది. ఏప్రిల్ 9న పెషావర్ జల్మీతో జరగనున్న తదుపరి మ్యాచ్ కంటే ముందే వార్నర్ తిరిగి పాకిస్థాన్ చేరుకుని జట్టుతో కలిసే అవకాశం ఉంది.

కరాచీ కింగ్స్ యాజమాన్యం కొంతమంది ఆటగాళ్లకు ఈ చిన్న విరామాన్ని మంజూరు చేసింది. డేవిడ్ వార్నర్‌తో పాటు హసన్ అలీ, ఆడమ్ జంపా, అజామ్ ఖాన్‌లు కూడా తాత్కాలికంగా జట్టు నుంచి విరామం తీసుకున్నారు.
2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. గత సీజన్‌లో సిడ్నీ థండర్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. కేవలం 8 ఇన్నింగ్స్‌లలో 433 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘ కాలం ఆడిన డేవిడ్ వార్నర్.. సారథిగా ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడినా మునపటిలా సత్తా చాటలేకపోయాడు. దాంతో అతని ఐపీఎల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. వార్నర్‌కు తెలుగు అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంది. సన్‌రైజర్స్‌కు ఆడే సమయంలో తన రీల్స్‌తో వార్నర్ తెలుగు అభిమానులను ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమాలో కూడా నటించాడు.