Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు: ఓజా

Former spinner Pragyan Ojha slams Virat Kohlis critics for questioning his paternity leaves

ముంబై: పితృత్వ సెలవులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మంగళవారం ఆస్ట్రేలియా నుంచి భారత్ వస్తున్న విషయం తెలిసిందే. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే కోహ్లీ ఇండియాకి వచ్చేస్తున్నాడు. బీసీసీఐ కూడా అతనికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. దీంతో మిగతా మూడు టెస్టులకు విరాట్ దూరంకానున్నాడు. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. కొందరు కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. మరికొందరు మండిపడుతున్నారు.

కోహ్లీపై ట్రోల్స్

కోహ్లీపై ట్రోల్స్

ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్ తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. అయితే తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలడంతో కోహ్లీసేన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ.. తొలి టెస్టు ఓటమితో బెదిరిపోయి స్వదేశానికి వచ్చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా స్పందించాడు. కోహ్లీ పర్సనల్ లైఫ్ డిసెషన్ గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నాడు. బీసీసీఐకి ముందే విషయం చెప్పాడని, ఈ విషయంలో ఇంత రాద్ధాంతం అవసరం లేదని నెటిజన్లకు చురకలు వేశాడు.

 బీసీసీఐకి ముందే చెప్పాడు

బీసీసీఐకి ముందే చెప్పాడు

తాజాగా ప్రగ్యాన్ ఓజా స్పోర్ట్స్ టుడే యూట్యూబ్‌లో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్‌ గురించి ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాన్ని మనం గౌరవించాలి. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని అందరం గౌరవించాలి. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లక ముందే విరాట్ స్పష్టంగా తన నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పాడు. తొలి టెస్టు తర్వాత పర్యనట నుంచి తాను వైదొలగనున్నట్లు స్పష్టం చేశాడు. అది అతనిష్టం. అనుష్క శర్మకి ప్రసవ సమయంలో కోహ్లీ సపోర్ట్ కావాలి. ఇదే విషయాన్ని బీసీసీఐకి కూడా ముందే తెలియజేశాడు' అని అన్నాడు.

కోహ్లీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు

కోహ్లీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు

'బీసీసీఐకి కూడా తన నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ ముందే తెలియజేశాడు. మరి సిరీస్ మధ్యలో ఎలా వెళ్లిపోతాడు?. అది కూడా తొలి టెస్టులో ఓటమి తర్వాత.. అని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. నిజమే తొలి టెస్టు ఓటమి అందర్నీ బాధించింది. అంతమాత్రాన.. ఇప్పుడు కోహ్లీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండూ భిన్నమైనవి. రెండింటికి ముడిపెట్టవద్దు' అని ప్రగ్యాన్ ఓజా హితవు పలికాడు.

కెప్టెన్‌గా రహానే

కెప్టెన్‌గా రహానే

మెల్‌బోర్న్ వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు (బాక్సింగ్ డే టెస్ట్)మ్యాచ్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కెప్టెన్‌గా అజింక్య రహానే మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ జట్టుని నడిపించనున్నాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతో ఆడాలని భారత్‌ భావిస్తే తుది జట్టులో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. ఫిట్‌గా ఉంటే మాత్రం ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి స్థానంలో జడేజాను తీసుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

ISL 2020 21: మోహన్ బగాన్‌కు మరో విజయం.. బెంగళూరుకు తొలి ఓటమి!!

Story first published: Tuesday, December 22, 2020, 12:20 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+